Rose Water: రోజూ రాత్రి పడుకునే ముందు ముఖానికి రోజ్ వాటర్ అప్లై చేస్తే కలిగే లాభాలు ఇవే..
Benefits of Rose Water: రోజ్ వాటర్ మీ బ్యూటీ రొటీన్లో చేర్చుకోవడం వల్ల మీ ముఖానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. సన్‌స్క్రీన్ వాడనివారికి ముఖం పై సన్‌బర్న్ వల్ల ట్యాన్ అవుతుంది. దీనికి రోజ్ వాటర్ ఎఫెక్టీవ్‌గా పనిచేస్తుంది. ఇందులో కూలింగ్ గుణాలు ఉంటాయి.
Benefits of Rose Water: రోజ్ వాటర్‌తో అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజ్ వాటర్ ముఖానికి అప్లై చేస్తే రోజంతా ముఖం తాజాదనంగా కనిపిస్తుంది. మీ బ్యూటీ రొటీన్లో రోజ్ వాటర్ చేర్చుకోవచ్చు. డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్ అన్నీ చర్మాల వారు రోజ్ వాటర్‌ను ఉపయోగించవచ్చు. దీంతో మీ ముఖం కాంతివంతంగా మారుతుంది. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు రోజ్ వాటర్ ముఖానికి అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.
సన్‌బర్న్..
రోజ్ వాటర్ మీ బ్యూటీ రొటీన్లో చేర్చుకోవడం వల్ల మీ ముఖానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. సన్‌స్క్రీన్ వాడనివారికి ముఖం పై సన్‌బర్న్ వల్ల ట్యాన్ అవుతుంది. దీనికి రోజ్ వాటర్ ఎఫెక్టీవ్‌గా పనిచేస్తుంది. ఇందులో కూలింగ్ గుణాలు ఉంటాయి. రోజ్ వాటర్ ముఖం పై పేరుకున్న ట్యాన్‌ను సమర్థవంతంగా తగ్గిస్తుంది.
యాంటీ ఏజింగ్..
రోజ్ వాటర్‌లో యాంటీ ఏజింగ్ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. త్వరగా ముఖంపై వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా చేస్తుంది. అంతేకాదు ఇది ముఖంపై ఉండే ఫైన్ లైన్స్ తొలగిస్తుంది. రోజు రాత్రి పడుకునే ముందు రోజ్ వాటర్ ముఖానికి అప్లైచేస్తే ముఖంపై గీతలు కూడా తొలగిపోతాయి.
ఇదీ చదవండి: నోరూరించే రొయ్యల కూర ఇలా వండుకుంటే నోట్లో కరిగిపోతుంది అంతే..
వాపు..
రోజ్ వాటర్ ఉపయోగించడం వల్ల చర్మంపై దురద,వాపు సమస్య కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే ఇందులో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ముఖంపై దురదలు రాకుండా నివారిస్తుంది. మీ స్కిన్ కేర్ రొటీన్లో రోజ్ వాటర్ చేర్చుకోవడం వల్ల ముఖం మెత్తగా ఉంటుంది. ఏవైనా ఉత్పత్తులు ముఖానికి వాడినప్పుడు మీకు పడకుంటే కూడా రోజ్ వాటర్‌ను ఉపయోగించి తగ్గించుకోవచ్చు. ఇందులో నయం చేసే గుణాలు కూడా ఉంటాయి.
హైడ్రేషన్..
రోజ్ వాటర్ ఉపయోగించడం వల్ల ముఖానికి మాయిశ్చర్ వాడుతుంది. ముఖం నిర్జీవంగా మారినప్పుడు రోజ్ వాటర్ వాడితే డీహైడ్రేషన్ గురికాకుండా ఉంటారు. రోజ్ వాటర్ ముఖానికి మాయిశ్చర్ అందుతుంది. మృదువుగా మారుతుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది. చర్మానికి మాయిశ్చర్ అందుతుంది.
ఇదీ చదవండి: ముఖం పై ట్యాన్ పోవట్లేదా? ఈ ఈజీ హోమ్ రెమిడీ తో చెక్ పెట్టండి..
పీహెచ్ లెవల్..
పీహెచ్ లెవల్స్ నిర్వహిస్తుంది రోజ్‌వాటర్. ఇది ముఖంపై ఉండే అదనప్పు ఆయిల్స్ తొలగిస్తుంది. ముఖంపై కనిపించే రంధ్రాలను కూడా సమర్థవంతంగా తగ్గిస్తుంది. రోజ్ వాటర్ నేచురల్ టోనర్‌గా పనిచేస్తుంది. అంతేకాదు ఇది సెబమ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter