Damaged Hair: దెబ్బతిన్న జుట్టును తిరిగి పొందడానికి బెస్ట్ 5 హెయిర్ ఆయిల్స్ ఇవే, రోజు ఇలా చేయండి!
5 Best Oils For Hair Growth, Dandruff And Dry Hair: జుట్టు సమస్యలతో బాధపడేవారు ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ 5 రకాల ఔషధ గుణాలు కలిగిన నూనెలను ప్రతి రోజు వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా జుట్టు రాలడం కూడా సులభంగా తగ్గుతుంది.
5 Best Oils For Hair Growth, Dandruff And Dry Hair: జుట్టు అందంగా, మందంగా, మెరిసేలా కనిపిస్తే ముఖం కూడా అందగా కనిపిస్తుంది. కానీ ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మందిలో జుట్టు రాలిపోవడం, తెల్లగా మారడం వంటి సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలు చాలా మందిలో కాలుష్యం కారణంగా కూడా వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తరచుగా మార్కెట్‌లో లభించే చాలా రకాల షాంపూలను వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించడం మానుకుని ఆయుర్వేద నిపుణులు సూచించి ఈ కింది నూనెలను ప్రతి రోజు వినియోగించాల్సి ఉంటుంది. వీటిలో ఉండే ఆయుర్వేద గుణాలు అన్ని రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
దెబ్బతిన్న జుట్టు మందంగా చేసే నూనెలు ఇవే:
జోజోబా ఆయిల్:
జోజోబా ఆయిల్‌లో అనేక రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. జుట్టు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఈ నూనెను జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టుకు తేమ, పోషణ లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా డ్యామేజ్ అయిన జుట్టు కూడా సులభంగా మెరుగుపడుతుంది.
కొబ్బరి నూనె:
ప్రస్తుతం చాలా మంది వినియోగిస్తున్న ఆయిల్స్‌లో కొబ్బరి నూనె ఒకటి. ఈ నూనె పూర్వీకుల నుంచి వినియోగిస్తున్నారు. దెబ్బతిన్న జుట్టు నుంచి తిరిగి పొందడానికి ప్రతి రోజు ఈ నూనెను జుట్టుకు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా అప్లై చేసి 30 పాటు ఉంచి శుభ్రం చేసుకుంటే మంచి లాభాలు పొందుతారు. అంతేకాకుండా జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.
ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?
ఆలివ్ ఆయిల్:
ఆలివ్ ఆయిల్ కూడా జుట్టు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే మూలకాలు జుట్టును లోపలి నుంచి రిపేర్ చేసి తీవ్ర జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ ఆయిల్‌ను క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల జుట్టు మృదువుగా తయారవుతుంది. అంతేకాకుండా జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.
ఉల్లిపాయ నూనె:
ప్రస్తుతం ఉల్లిపాయ నూనె మార్కెట్‌లో విచ్చలవిడిగా లభిస్తోంది. దీనిని జుట్టుకు ప్రతి రోజు వినియోగించడం వల్ల జుట్టు దృఢంగా, మెరిసేలా తయారవుతుంది. అంతేకాకుండా రాలిపోయిన జుట్టుకు కూడా తిరిగా వస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తరచుగా జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ప్రతి రోజు వినియోగించాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి