Home remedies for Black Hair: నేటి కాలంలో చిన్నపిల్లలకు కూడా తెల్లజుట్టు సమస్య వేధిస్తోంది. అయితే  ఆరోగ్యకరమైన జీవనశైలిని ఫాలో అవుతూ కొన్ని సహజమైన హెర్బల్ హెయిర్ ప్యాక్‌లు నెరిసిన జుట్టు సమస్యను తగ్గించుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలిని ఫాలో అవుతూ కొన్ని సహజమైన హెర్బల్ హెయిర్ ప్యాక్‌లు నెరిసిన జుట్టు సమస్యను తగ్గించుకోవచ్చు.ప్రస్తుతకాలంలో చాలా మంది తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఈ సమస్య యువతలో ఎక్కువగా కనిపిస్తుంది. దీని కోసం మార్కెట్‌లో లభించే ప్రొడెట్స్‌లను ఉపయోగిస్తున్నారు. కానీ, సైడ్‌ ఎఫెక్ట్స్ తోపాటు ఖర్చుతో కూడుకున్నవి. ఈరోజు సహజసిద్ధమైన రెమిడీస్ ఏం ఉంటాయో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరివేపాకు..
కరివేపాకు మన ఇంటి కిచెన్లో ఎప్పుడూ ఉంటుంది. ఇది అతి తక్కువ ధరలో అందుబాటులో ఉంటుంది. కరివేపాకులో మెలనిన్ అనే సహజ వర్ణద్రవ్యం ఉంటుంది. ఇది జుట్టును నల్లగా చేస్తుంది. కరివేపాకుతో తెల్లజుట్టు ప్రభావాన్ని తగ్గిస్తుంది. కరివేపాకు ఆకులు ఓ గిన్నెడు తీసుకుని  మరో గిన్నెలో కొబ్బరినూనె తీసుకుని బాగా మరిగించుకోవాలి. దీంట్లో కాసిన్ని మెంతి గింజలు కూడా వేసుకని ఈ రెండిటినీ పేస్ట్‌ చేసుకుని వేసుకోవాలి. ఈ నూనె వేడి తగ్గిన తర్వాత జుట్టుకు అప్లై చేసుకోవాలి. ఓ గంట అయ్యాక తలస్నానం చేస్తే సరిపోతుంది. వారానికి కనీసం రెండుస్తార్లు కరివేపాకు నూనెను తలకు పట్టించాలి. ఇలా చేయడం వల్ల నెరిసిన జుట్టు సమస్య ఉండదు.


టీ..
మీ జుట్టు తెల్లగా మారిపోతుంటే మరో బెస్ట్‌ హోం రెమిడీ బ్లాక్ టీ. దీంతో మీ జుట్టు నల్లగా మారిపోతుంది. ఒకచెంచా బ్లాక్ టీ ఒక కప్పు నీటిలో వేసి బాగా మరిగించాలి. సగం అయ్యే వరకు మరిగించుకోవాలి. దాన్ని జుట్టుకు అప్లై చేసుకోవాలి. దీన్ని ఓ గంటైన తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చేసుకోవాలి.


ఇదీ చదవండి: ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువగా ఉందా? ఈ 3 ఆకులను నమిలండి చాలు.. షుగర్ కంట్రోల్ అవుతుంది..!


హెన్నా..
ఇది మనందరికీ తెలిసిన రెమిడీనే. తెల్లజుట్టును నల్లబరచడానికి ఇది ఎఫెక్టివ్ రెమిడీ. హెన్నాను మరిగించిన కాఫీ పొడినీటిలో కలపాలి. దీన్ని జుట్టుకు కుదుళ్ల నుంచి అప్లై చేసుకోవాలి. జుట్టుకు ప్యాక్ మాదిరి వేసుకోవాలి. ఇది ఆరిన తర్వాత షాంపూతో స్నానం చేయాలి. హెన్నా, కాఫీ పొడి కూడా తెల్లజుట్టు సమస్యను పరిష్కరిస్తాయి.


ఇదీ చదవండి: ఆహారం తిన్నవెంటనే అసిడిటీ సమస్యా? ఈ 5 హోంరెమిడీస్‌తో సమస్యకు చెక్ పెట్టండి..


మెంతులు..
మెంతుల్లో అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇది జుట్టునెరిసిపోవడానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. మెంతిగింజలను రాత్రంతా నానబెట్టి ఉదయం గ్రైండ్ చేసుకుని ప్యాక్ వేసుకోవాలి. జుట్టు ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.