Best Home remedy for Open Pores: ఓపెన్ పోర్స్ సమస్యకు చక్కని రెమిడీ.. ముఖం నునుపుగా మారిపోతుంది..
Open Pores Remedy: చాలామంది ఓపెన్ పోర్స్ సమస్యలతో బాధపడుతుంటారు. దీంతో ముఖంపై గుళ్ల మాదిరి చూడ్డానికి అంత వికారంగా కనిపిస్తుంది. కొన్ని రకాల హోమ్ రెమెడీస్ తో ఈ ఓపెన్ ఫోర్ సమస్యకు చెక్ పెట్టొచ్చు
Open Pores Remedy: చాలామంది ఓపెన్ పోర్స్ సమస్యలతో బాధపడుతుంటారు. దీంతో ముఖంపై గుళ్ల మాదిరి చూడ్డానికి అంత వికారంగా కనిపిస్తుంది. కొన్ని రకాల హోమ్ రెమెడీస్ తో ఈ ఓపెన్ ఫోర్ సమస్యకు చెక్ పెట్టొచ్చు ఇందులో కెమికల్స్ ఉండవు, సహజ సిద్ధంగా ఇంట్లో ఉండే వస్తువులతో ఓపెన్ ఫోర్స్ కి ఎలా చెక్ పెట్టాలో తెలుసుకుందాం.ఈ హోం మేడ్ ఫేస్ ప్యాక్ లను యోగాట్ హనీ క్లే ఉపయోగించి తయారు చేసుకోవచ్చు ఇది చర్మాని టైట్ గా కూడా చేస్తుంది.
నిమ్మకాయ, తేనె..
ఇది కూడా ఓపెన్ పోర్స్ సమస్యకు చెక్ పెట్టడానికి మంచి రెమెడీ. ఒక టేబుల్ స్పూన్ తేనె, అర టేబుల్ స్పూన్ నిమ్మకాయ రసం, ఒక టేబుల్ స్పూన్ చక్కెర వేసి కలిపి పేస్ట్ అయ్యేలా కలుపుకోవాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి ముఖం పూర్తిగా ఆరిపోయే వరకు అలాగే వదిలేసి నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.
ఇదీ చదవండి: ఈ 4 మూలికలు వేసవిలో శరీరాన్ని లోపలి నుండి చల్లగా ఉంచుతాయి..
పసుపు, శనగపిండి..
ఒక టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకొని అందులో చిటికెడు పసుపు టేబుల్ స్పూన్ పెరుగు కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ వేసుకొని పేస్టు మాదిరి తయారు చేసుకోవాలి .ఈ పేస్టు 20 నిమిషాల పాటు రిఫ్రిజిరేట్ చేసుకొని ఒక మొత్తం అప్లై చేసుకుని ఒక 20 నిమిషాలు తర్వాత మామూలు వాటర్ తో ఫేస్ వాష్ చేసుకోవాలి.
ఎక్ ఫేస్ మాస్క్..
ఇది కూడా ఇంట్లో ఎంతో సులువుగా చేసుకునే ఫేస్ మాస్క్ దీనికి ఎగ్ వైట్ తీసుకొని అందులో కుకుంబర్ జ్యూస్ ముల్తానీ మట్టి వేసి కలుపుకొని వేస్ట్ మాదిరి తయారు చేసుకోవాలి దీని ముఖమంతా అప్లై చేసుకుని ఒక 15 నిమిషాల తర్వాత ముఖం సాధారణ నీటితో కడగాలి.
ఇదీ చదవండి: తాటిముంజలతో మహాబలం.. తెలిస్తే ఇక అస్సలు వదలరు..
ముల్తానీ మిట్టి, టమాటా జ్యూస్..
ఈ ఫేస్ ప్యాక్ ను కూడా ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. మూల్తానా మట్టి రెండు టేబుల్ స్పూన్ల టమాటా జ్యూస్ వేసుకొని పేస్టు మాదిరి తయారు చేసుకోవాలి. ఇందులో కావాలంటే గంధం కాసింత పసుపు కూడా వేసుకొని తయారు చేసుకోవచ్చు. ఈ నాలుగింటిని కలిపి ముఖానికి అప్లై చేసుకొని 15 నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి
శనగపిండి, పెరుగు..
రెండు ఒక్కో స్పూన్ చొప్పున తీసుకొని పేస్టు మాదిరి తయారు చేసుకోవాలి. దీన్ని ముఖమంతా మెడకు గొంతు భాగంలో అప్లై చేసుకొని ఆర్య వరకు అలాగే ఉంచి ఆ తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter