Prosperity: మనం జీవితంలో ఎదగడానికి ఎంతో కష్టపడుతుంటాం. కొంతమంది ఉన్నట్టుండి లైఫ్ లో సెటిల్ అయిపోతూ ఉంటారు.. అబ్బ ఏం అదృష్టవంతుడు రా అని అనుకుంటాం కానీ మన జీవితంలో వచ్చే అదృష్టాన్ని మనమే నెగ్లెట్ చేస్తున్నాం అని మర్చిపోతాం. అవునండి ప్రతి మనిషికి కూడా మంచి రాబోయే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయట. అలాగే మనం జీవితంలో చిన్న చిన్న విషయాల్లో తీసుకునే జాగ్రత్తలు మన ఇంటికి అదృష్ట లక్ష్మిని తీసుకువస్తాయి. మరి ఆ సంకేతాలు ఏమిటో ?తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో? ఓ లుక్కేద్దాం పదండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మంచి రోజులు రావడానికి ముందు కొన్ని శుభసంకేతాలు వాటి అంతట అవే మన కళ్ళ ముందు జరుగుతాయి. వాటిని మనం అర్థం చేసుకోగలిగితే మన జీవితంలో సగం కష్టాలు తీరిపోతాయి. వాటిల్లో మొదటిది ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ కొడితే అందులో పువ్వు రావడం. ఇది మనకు అందరికీ తెలిసిన విషయమే ఒకవేళ కూలిన కొబ్బరికాయ వస్తే అపశకునంగా భావిస్తారు అదే కొబ్బరికాయలో పువ్వు వస్తే జరగబోయే శుభానికి సంకేతంగా పరిగణిస్తారు.


కొన్నిసార్లు మనకు తెలియకుండా ఇంటిలోకి నల్ల చీమలు బార్లుగా వస్తాయి. ఇంట్లో ఏదో పాడైపోయింది అనుకోకండి అది కూడా ఒక శుభ సూచకమే. అలాగే మన ఇంటి ఆవరణలో ఏదైనా పక్షి గూడు పెట్టుకుంటే దాన్ని పొరపాటున కూడా తరమకండి. పక్షి గూడు సమృద్ధి కి సూచన. ఇక గుడికి వెళ్లి వచ్చే సమయంలో తెల్లటి ఆవు, బ్రాహ్మణులు ఎదురు రావడం శుభసంకేతం. జీవితంలో మీరు పొందబోయే సక్సెస్ కు అది సూచన.


కొందరు ఏనుగు కనిపిస్తే భయపడతారు కానీ అలా ఎప్పటికీ చేయకూడదు. ఏనుగు ను లక్ష్మీదేవి స్వరూపంగా భావించి ప్రసాదంగా ఏమన్నా పెడితే సకల శుభాలు కలుగుతాయి.


గమనిక: పైన ఇచ్చిన సమాచారం నిపుణుల సూచనల మేరకు సేకరించినది. కొత్తది ప్రయత్నించే ముందు మీ డాక్టర్ ను సంప్రదించడం మంచిది.


Also Read:  Alla Ramakrishna Reddy: వైసీపీకి బిగ్‌షాక్.. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా


Also Read:  Allu Arjun: హాయ్ నాన్న రివ్యూ ఇచ్చేసిన అల్లు అర్జున్.. నానిపై ప్రశంసలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి