Belly Fat: రోజూవారీ ఉరుకులు పరుగుల జీవితంలో వివిధరకాల చెడు ఆహారపు అలవాట్ల కారణంగా బరువు విపరీతంగా పెరిగిపోతున్నారు. వర్క్ ఫ్రం హోం అందుబాటులో వచ్చాక ఈ సమస్య మరింతగా పెరిగింది. శారీరక శ్రమ లేకపోవడం మరో ప్రధాన కారణం. అయితే డైటింగ్, వ్యాయామం లేకుండానే కొన్ని చిట్కాలతో ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చంటున్నారు. అదెలాగో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రోజ వివిధ రకాల అనారోగ్యపు అహారపు అలవాట్ల కారణంగా స్థూలకాయం పెను సమస్యగా మారుతోంది. ఒకవేళ బరువు మరీ అంత లేకపోయినా వర్క్ ఫ్రం హోం కారణంగా బెల్లీ ఫ్యాట్ అంటే నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోవడం గమనిస్తున్నాం. నలుగురిలో తీవ్ర అసౌకర్యంగా ఉండే పరిస్థితి. శారీరక శ్రమ లేకుండా గంటల తరబడి కంప్యూటర్ లేదా ల్యాప్ ముందు కూర్చుని ఉండటం వల్ల ఈ సమస్య కన్పిస్తోంది. బెల్లీ ఫ్యాట్ తగ్గించుకునేందు వ్యాయమం, డైట్ చేస్తుంటారు. మొత్తం శరీర బరువు తగ్గించుకోవడం కాస్త కష్టమైన పనే. అందుకే సాధ్యమైనంతవరకూ బెల్లీ ఫ్యాట్ తగ్గించుకుంటే చాలా ఉపశమనం కలుగుతుంది. ఆరోగ్యానికి మంచిది. కాస్త ఫిట్ అండ్ హెల్తీగా ఉండవచ్చు. అయితే ఇది డైట్ లేదా వ్యాయామంతో తగ్గిపోదు. కొన్ని చిట్కాలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. 


తేలికపాటి వ్యాయామం సరిపోతుంది. గంటల తరబడి జిమ్‌లో వర్కవుట్లు చేయాల్సిన అవసరం లేదు. అంటే డైటింగ్ , వ్యాయామం లేకుండానే పొట్ట చుట్టూ కొవ్వు తగ్గించే మార్గాలు ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా రోజూ తీసుకునే ఆహారం పరిమాణాన్ని తగ్గించాలి. ఎంత ఆకలిగా ఉన్నా సరే భోజనం పరిమాణం తగ్గించుకోవల్సిందే. అతిగా తినడం వల్ల అదనపు కేలరీలు, బరువు పెరిగిపోతారు. 


తినే ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినడం అలవాటు చేసుకోండి. పొట్ట కొవ్వు అదుపులో ఉంచుకోవాలంటే ఇది తప్పదు. భోజనం వేగంగా తినవద్దు. నెమ్మది నెమ్మదిగా తినడం మంచిది. రోజూ తగినంత నిద్ర తప్పనిసరిగా ఉండాలి. నిద్ర లేకపోతే కొవ్వు కరిగే ప్రక్రియ ఆగిపోతుంది. రోజుకు 7-8 గంటలు రాత్రి నిద్ర ప్రశాంతంగా ఉండాలి. దీనివల్ల గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. నిద్ర సరిగా ఉండటం వల్ల జీవక్రియ మెరుగుపడి బరువు నియంత్రణలో ఉంటుంది. పొట్ట చుట్టూ కొవ్వు వేగంగా కరుగుతుంది. 


పని చేసేటప్పుడు కూర్చునే పోశ్చర్ కూడా కీలకపాత్ర పోషిస్తుంది. సాధ్యమైనంతవరకూ నిటారుగా నిలువుగా కూర్చునేందుకు ప్రయత్నించండి. దీనివల్ల పొత్తి కడుపు కండరాలు కొవ్వును నియంత్రిస్తాయి. మరో ముఖ్యమైన చిట్కా రోజూ తగినన్ని నీళ్లు తాగాలి. నిమ్మరసం, హెర్బల్ టీ కూడా ఆరోగ్యానికి మంచిది. రోజూ తేలికపాటి వ్యాయామం చేస్తూ ఈ చిట్కాలు పాటిస్తే బెల్లీ ఫ్యాట్ సమస్య చాలా త్వరగా తొలగిపోతుంది. 


Also read: Peanuts Benefits: చలికాలంలో వేరుశెనగలను స్నాక్స్‌గా తీసుకుంటే బోలెడు లాభాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook