Diet For Weight Loss: ప్రస్తుతం చాలా మంది బరువు తగ్గడానికి డైటీషియన్లను ఆశ్రయిస్తున్నారు. అయినప్పటికీ వారు చెప్పిన సలహాలు, సుచనలు మాత్రం పాటించడం లేదు.  మరికొందరైతే విచ్చలవిడిగా ఆహారాలు తీసుకుంటున్నారు. అయితే ఇలా చేయాడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలతో పాటు, చెడు కొలెస్ట్రాల్‌ కూడా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి శరీర బరువును తగ్గించుకోవడానికి తప్పకుండా అనుసరించే డైట్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పోషకాలు కలిగిన ఆహారాలు డైట్‌లో తీసుకోవాల్సి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బరువు తగ్గే క్రమంలో రాత్రి భోజనం తీసుకోవచ్చా?
బరువు తగ్గే క్రమంలో పోషకాలు కలిగిన ఆహారాలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా రాత్రి పూట తేలికపాటి ఆహారాలు తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా శరీరంలో కొలెస్ట్రాల్ కూడా సులభంగా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది బరువు తగ్గడానికి రాత్రి పూట భోనం మానుకుంటున్నారు. అయితే ఇలా చేయడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి రాత్రి పూట తప్పకుండా ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.


రాత్రి భోజనం చేయకపోవడం వల్ల కలిగే నష్టాలు:
1. బరువు తగ్గే క్రమంలో రాత్రి భోజనం చేయకపోతే.. శరీరంలో పోషకాల లోపం ఏర్పడే అవకాశాలున్నాయి. అంతేకాకుండా మూడ్ స్వింగ్స్ సమస్యలు సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. పొట్టలో ఆకలి పెరిగిపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి తగ్గిపోయి వివిధ రకాల దీర్ఘకాలీక సమస్యలకు దారి తీసే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


2. రాత్రి భోజనం మానుకుంటే జీవక్రియ సమస్యలు వస్తాయి. దీని కారణంగా బరువు తగ్గడమేకాకుండా బరువు పెరిగే అవకాశాలున్నాయి.


3. రాత్రిపూట ఆహారం తీసుకోకపోవడం వల్ల మెదడు పనితీరు కూడా మందగిస్తుంది. అంతేకాకుండా తీవ్ర ఒత్తిడి సమస్యలు కూడా తలెత్తే ఛాస్స్‌ ఉందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొందరిలో డిప్రెషన్‌ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి బరువు తగ్గే క్రమంలో తప్పకుండా రాత్రి పూట భోజనం చేయాలి.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: Ram Charan counter: ఆయన్ని ఏమన్నా అంటే ఆయన ఊరుకుంటారేమో, వెనకాల ఉండే మేము ఊరుకోం!


Also Read: Nandamuri Taraka Ratna Health: నందమూరి అభిమానులకు షాక్.. తారకరత్నకు మరో అరుదైన వ్యాధి గుర్తింపు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook