Bhogi Mantalu 2024: సంక్రాంతి పండగ అనగానే తెలుగు రాష్ట్రాల పల్లెలోకి కొత్త శోభ సంతరించుకుంటుంది. సంక్రాంతి 3 రోజులపాటు ముగ్గులు, భోగి మంటలు, కోడిపందాలు, గంగిరెద్దుల ఆటలు, హరిదాసు కీర్తనలు ఆడపడుచుల కోలాటాలు ఇలా ఒకటా రెండా ఊరంతా పండగ వాతావరణం నెలకొంటుంది. ఇలా మూడు రోజులపాటు సాగే సంక్రాంతి పండగలో భాగంగా మొదటి రోజు భోగి పండుగను జరుపుకోవడం ఓ ఆనవాయితీగా వస్తోంది. ఈ భోగి పండుగ రోజు ఉదయాన్నే భోగి మంటలు వేయడం నుంచి మకర సంక్రాంతి పండగ వేడుకలు ప్రారంభమవుతాయి. చాలామందికి ఇప్పటికి భోగి మంటని ఎందుకు వేస్తారో అనేది తెలియనే తెలియదు. భోగి మంటని ఎందుకు వేస్తారో తెలుసా? తెలియని వారి కోసం జీ తెలుగు న్యూస్ ప్రత్యేక స్టోరీ..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


శాస్త్రీయంగా భోగిమంటకు ఉన్న ప్రత్యేక కారణాలు ఇవే:
మకర సంక్రాంతి సమయంలో సూర్యుడు దక్షిణాయనం ప్రవేశించకుండా ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. దీని కారణంగా వాతావరణంలోని తేమ పరిమాణాలు ఎక్కువగా పెరిగిపోయి..చలి తీవ్రత కూడా పెరుగుతుంది. ఈ చలి కారణంగా చాలామంది ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడతారు. అయితే ఈ చలిని తట్టుకోవడానికి భోగి మంటలను వేస్తారని పురాణాల్లో పేర్కొన్నారు. ఇక ఆధ్యాత్మికంగా చూస్తే.. దక్షిణాయణంలో పడ్డ కష్టాలన్నీ ఉత్తరాయణంలో తొలగించాలని భోగిమంటలు చేస్తారని మరి కొంతమంది చెబుతూ ఉంటారు..


ఆరోగ్యపరంగా భోగిమంటకున్న ప్రత్యేకత:
పురాణాల ప్రకారం భగ అని ఒక పదం నుంచి భోగి వచ్చిందని చెబుతూ ఉంటారు. భగ అంటే అందరికీ తెలిసిందే.. మంట అని అర్థం.. అయితే చాలామంది భోగి రోజు వెచ్చదనం కోసం భోగిమంటలు వేస్తారని అనుకుంటూ ఉంటారు. కానీ పురాణాల ప్రకారం ధనుర్మాస సమయంలో చాలామంది అనారోగ్య సమస్యల బారిన పడుతూ ఉంటారు. అయితే ఈ సమయంలో భోగిమంటలు వేసి ఇంటి ముందు పిడకలను కాల్చడం వల్ల గాలి శుద్ధ అవడమే కాకుండా.. సూక్ష్మజీవులు నశిస్తాయట.


అలాగే భోగి మంటలు భాగంగా రావి కొమ్మలు, మామిడి ఆకులు, మేడి కొమ్మలను మంటలో కాల్చుతూ ఉంటారు. మరికొందరైతే ఆవు నెయ్యిని కూడా వేసి బెరడులతోపాటు కాలుస్తారు. వీటన్నిటిలో అనేక రకాల ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి వీటి నుంచి వచ్చిన పొగను పీల్చుకోవడం వల్ల శరీరంలో ఉండే 70 వేలకు పైగా నాడులు ఉత్తేజితమై అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అందుకే ప్రతి సంవత్సరం భోగి మంటను వేయడం ఓ ఆనవాయితీగా వస్తోంది.


భోగి మంటను వేసేవారు ఈ తప్పులు చేయకండి:
మన పూర్వీకులు భోగిమంటల్లో పాత వస్తువులను మాత్రమే కాల్చాలని చెబుతూ ఉంటారు దీని కారణంగా చాలామంది ఇంట్లో ఉండే అన్ని రకాల వస్తువులను కాలుస్తూ ఉంటారు ముఖ్యంగా ఇంట్లో పాతబడ్డ ప్లాస్టిక్ వస్తువులు పాటు రబ్బర్, టైర్లను కాలుస్తూ ఉంటారు. ఇలా కాల్చడం వల్ల వెలుపడ్డ పొగను పీల్చుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అంతేకాకుండా శ్వాసకోశ సమస్యలతో పాటు వాతావరణం కూడా కాలుష్యం అవుతోంది. కాబట్టి ఇలాంటి వస్తువులను కాల్చకపోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.


Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter