Black Grape Juice Benefits In Telugu: నల్ల ద్రాక్ష అద్భుతమైన రుచి కలిగి ఉండడమే కాకుండా ఇందులో శరీరానికి అవసరమైన పోషకాలు ఎక్కువ మోతాదులో లభిస్తాయి.  కాబట్టి వేసవి కాలం కంటే వీటిని ఎక్కువగా శీతాకాలంలో తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్లు కూడా లభిస్తాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగించేందుకు కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. తరచుగా నల్ల ద్రాక్షను ఆహారంలో తీసుకోవడం వల్ల ఇవే కాకుండా ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అయితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నల్ల ద్రాక్ష లాభాలు, పోషకాలు:
యాంటీ ఆక్సిడెంట్ల భండారం: 

నల్ల ద్రాక్షలో శరీరానికి అవసరమైన రెస్వెరాట్రాల్ అనే అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇది మానవ శరీరంలోన్ని అన్ని రకాల కణాల నష్టం నుంచి విముక్తి కలిగించేందుకు సహాయపడుతుంది. అలాగే అనేక రకాల వ్యాధులు కూడా దూరమవుతాయి. 


విటమిన్ల మూలం: 
నల్ల ద్రాక్షలో బాడీకి అవసరమైన విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఇ వంటి అనేక రకాల విటమిన్లు ఎక్కువ మోతాదులో లభిస్తాయి. ఇవి అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగించేందుకు సహాయపడుతుంది. దీంతో పటు పోషకాల లోపం నుంచి విముక్తి కలుగుతుంది.


ఖనిజాల నిధి: 
ఈ ద్రాక్ష రసం రోజు తాగితే పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు శరీరానికి లభిస్తాయి. దీని కారణంగా ఎముకల ఆరోగ్యం, రక్తపోటు నియంత్రణ వంటి అనేక రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఇవే కాకుండా ఐరన్‌ లోపం నుంచి కూడా విముక్తి కలుగుతుంది.


ఫైబర్ లోపానికి చెక్‌: 
నల్ల ద్రాక్షలో ఎక్కువ మోతాదులో ఫైబర్ కూడా ఉంటుంది. ఇది జీర్ణక్రియను ఆరోగ్యవంతంగా చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా మలబద్ధకాన్ని నివారించేందుకు కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇవే కాకుండా పొట్ట కూడా క్లిన్‌ అవుతుంది.


ప్రయోజనాలు:
గుండె సమస్యలకు:


ఇందులో ఉండే రెస్వెరాట్రాల్ గుండె ఆరోగ్యాన్ని కాపాడేందుకు సహాయపడుతుంది.అంతేకాకుండా గుండె జబ్బులు రాకుండా చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


రోగ నిరోధక శక్తి:  


నల్ల ద్రాక్ష రసం తాగడం వల్ల శరీరానికి విటమిన్ సి ఎక్కువ మోతాదులో లభిస్తుంది. ఇది రోగ నిరోధక శక్తిని మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది.


చర్మం సమస్యలకు:


నల్ల ద్రాక్ష రసం తాగడం వల్ల శరీరానికి యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి చర్మాన్ని మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది.


బరువు తగ్గడానికి:


ఈ ద్రాక్షలో ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది. ఇది ఆకలిని తగ్గించి.. బరువు నియంత్రణకు సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇవే కాకుండా ఇందులో ఉండే కాల్షియం, మెగ్నీషియం ఎముకలను దృఢంగా చేసేందుకు సహాయపడుతుంది. 


Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.