Hair Care Tips: నల్ల మిరియాలతో బట్టతలకు ఇలా సులభంగా చెక్ పెట్టొచ్చు..
Black Pepper For Bald Head: నల్ల మిరియాలు అనారోగ్య సమస్యలేకాకుండా జుట్టు సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే జుట్టు సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఎలా నల్ల మిరియాలను వినియోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Black Pepper For Bald Head: నల్ల మిరియాల్లో శరీరానికి కావాల్సిన చాలా రకాల ఔషధ గుణాలు ఉంటాయి. కాబట్టి చాలా మంది ఆహారాల్లో వినియోగిస్తారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. అయితే ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా జుట్టుకు కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు జుట్టు రాలడాన్ని తగ్గించి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి తరచుగా జుట్టు రాలడం, జుట్టులో చుండ్రు సమస్యలు తగ్గడానికి ప్రతి రోజూ ఈ నల్ల మిరియాలను ఆహారాల్లో వినియోగించాల్సి ఉంటుంది. అయితే నల్ల మిరియాలను వినియోగించడం వల్ల శరీరానికే కాకుండా జుట్టుకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
జుట్టుకు నల్ల మిరియాలు వల్ల కలిగే ప్రయోజనాలు:
చుండ్రును తగ్గిస్తుందిత:
నల్ల మిరియాలు చుండ్రు సమస్యను సులభంగా తొలగించడానికి సహాయపడుతుంది. అయితే ఈ జుట్టు సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ పెరుగులో నల్ల మిరియాల పొడిని కలిపి తలకు అప్లై చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా చుండ్రు సమస్య నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ నుంచి తొలగించేందుకు సహాయపడుతుంది.
బట్టతల సమస్య:
నల్ల మిరియాలు బట్టతల సమస్యను తొలగించడానికి ప్రభావవంతంగా సహాయపడుతుంది. ముఖ్యంగా జుట్టు పెరుగుదలకు, జుట్టు రాలడాన్ని తగ్గించేందుకు సహాయపడుతుంది. కాబట్టి బట్టతల సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ జుట్టుకు పైన పేర్కొన్న మిశ్రమాన్ని వినియోగించాల్సి ఉంటుంది.
జుట్టు పొడిబారడాన్ని తగ్గిస్తుంది:
వాతావరణంలో కాలుష్యం కారణంగా జుట్టు పొడి బారడం, ఇతర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ చిట్కాను పాటించాల్సి ఉంటుంది. అయితే ఈ మిరియాల మిశ్రమాన్ని తయారు చేసుకోవడానికి ముందుగా మిరియాల పొడిని తీసుకుని అందులో తేనెను మిక్స్ చేయాల్సి ఉంటుంది. ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని ప్రతి రోజు జుట్టుకు అప్లై చేస్తే జుట్టు పొడిబారడాన్ని తగ్గుతుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read : Chiranjeevi Nenoka Natudni : 'నేనొక నటుడ్ని'.. అల్పసంతోషిని, దేవుడ్ని, జీవుడ్ని.. చిరు మాటల ప్రవాహాం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook