Blood Purify Natural Tea: ఈ డిటాక్స్ టీల వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..!
Blood Purify Natural Tea: శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకునే ఆహారంలో శ్రద్ధ వహించాలి. తద్వారా శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లు శుభ్రమవుతాయి. అయితే ఆహారం తీసుకునే ముందు పలు రకాల డిటాక్స్ డ్రింక్స్‌ను తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Blood Purify Natural Tea: శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకునే ఆహారంలో శ్రద్ధ వహించాలి. తద్వారా శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లు శుభ్రమవుతాయి. అయితే ఆహారం తీసుకునే ముందు పలు రకాల డిటాక్స్ డ్రింక్స్‌ను తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇవి శరీరంలోని రక్తంలో పేరుకు పోయిన టాక్సిన్లులను తొలగిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఈ డిటాక్స్ డ్రింక్స్ ను టీ రూపంలో కూడా తాగొచ్చని వారు చెబుతున్నారు. ఈ పలు రకాల టీ తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బార్ బయటకు వచ్చి శరీరం ఆరోగ్యవంతంగా మారుతుందని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ టీల వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం..
కొత్తిమీర, పుదీనా టీ (Coriander-mint tea):
కొత్తిమీర, పుదీనా ఆకులతో చేసిన టీ శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతాయి. దీని కోసం.. ఒక పాత్రలో 1 గ్లాసు నీళ్లు తీసుకుని అందులో కొన్ని పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులు వేసి.. 10 నిమిషాల పాటు ఉడకబెట్టిన తర్వాత.. టీ లాగా గోరువెచ్చగా త్రాగాలి.
తులసి టీ(Basil tea):
రోజూ 8 నుంచి 10 తులసి ఆకులను తినడం వల్ల రక్తం శుద్ధవుతుందని ఆయుర్వేద శాస్త్రంలో వివరించారు. వీటితో చేసిన టీ తాగడం వల్ల శరీరం రెట్టింపు ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు తెలుపుతున్నారు.
లెమన్ టీ (Lemon tea):
నిమ్మకాయలో ఉండే అసిడిక్ గుణాలు రక్తంలోని మురికిని శుభ్రం చేసేందుకు ఎంతగానో కృషి చేస్తాయి. దీని కోసం రోజూ ఒక గ్లాస్ లెమన్ వాటర్ తాగడం వల్ల రక్తం శుద్ధవుతుందని నిపుణులు పేర్కొన్నారు. ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో నిద్రలేచిన తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయ రసాన్ని కలుపుకొని త్రాగాలి.
అల్లం, బెల్లం టీ(Ginger and jaggery tea)
బెల్లం శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపేందుకు దోహదపడుతుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేయడానికి సహాయపడుతుంది. దీని కోసం.. 1 పెద్ద కప్పు నీటిలో కొద్దిగా అల్లం, చిన్న బెల్లం ముక్కను వేసి. దీన్ని 5 నుంచి 6 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత వడగట్టి తాగాలి.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Tomato Juice for weight loss: టమోటాలను ఇలా వాడితే కేవలం 15 రోజుల్లో మీ శరీర బరువు సగం తగ్గిపోతుంది
Also Read: White Onion Benefits: తెల్ల ఉల్లిపాయలను తింటే.. ఈ సమస్యలు దూరమవుతాయి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.