COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Blue Super Moon 2023: మనం తరచుగా చందమామను చూస్తూ ఉంటాం..అది ఎప్పుడు పిండి వెన్నెలను కాస్తూ తెల్లగా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. కానీ మీరు ఈ రోజు ఎప్పుడు చూడని రంగులో మూన్‌ను చూడబోతున్నారు. ఇది మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. అవును ఇది అక్షరాల నిజం..సూపర్ లేదా బ్లూ మూన్ 2 నుంచి 3 సంవత్సరాలకు ఒక సారి వస్తుంది. అయితే అంతరిక్షంలో జరిగే కొన్ని సంఘటనల కారణంగా బ్లూ మూన్ ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ మూన్‌ ఒక నెలలో రెండు పౌర్ణమిలు వచ్చినప్పుడు వస్తుందని నిపుణులు తెలిపారు. అయితే ఈ  బ్లూ మూన్ ప్రత్యేక ఏమిటో, దీనికి సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ఈ  బ్లూ మూన్ ఆగస్టు 30న (ఈ రోజు)న రాత్రి కనిపించబోతోంది. ఈ చందమామ ప్రతి రోజు వచ్చే దాని కంటే  ఆకాశంలో పెద్దగా ప్రకాశవంతంగా కనిపిస్తాడు. సాధారణ రోజులతో పోలిస్తే ఈ రోజున చంద్రుడు 14% పెద్దగా కనిపిస్తే..ఈ రోజు మాత్రం రెట్టింపుతో కనిపించబోతున్నాడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పౌర్ణమి రోజున చంద్రుడి కక్ష్య భూమికి దగ్గరగా వచ్చినప్పుడు సూపర్‌మూన్ సంభవిస్తుంది. ఇలా రావడం చాలా అరుదని నిపుణులు అంటున్నారు. గత పది సంవత్సరాల క్రీతం సూపర్ మూన్‌ వచ్చిందని ఈ రోజు చంద్రుడు మళ్లీ బ్లూ కలర్‌లో కనిపించబోతోంది. 


ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్


ప్రతి సంవత్సరం సుమారు 11 రోజులు పెరుగుతుంది. అంటే రెండు మూడు సంవత్సరాలు కలిపి అదనపు నెలగా పిలుస్తారు. దీనిని జ్యోతిష్య శాస్త్రంలో అధిక మాసం లేదా మాల మాసం అని కూడా అంటారు. ఈ ఏడాది శ్రావణ మాసంలోనే మాల వచ్చింది. దీనికి తోడు ఈ సంవత్సరం శ్రావణ శుక్ల పక్ష పూర్ణిమ తిథి రోజున బ్లూ మూన్ కూడా ఏర్పడబోతోంది. అయితే ఈ మూన్‌ మళ్లీ కనిపించడానికి దాదాపు 10 సంవత్సరాలు పడుతుందని నిపుణులు తెలుపుతున్నారు. ప్రామాణిక కాలమానం ప్రకారం రాత్రి 8:37 గంటలకు ఈ బ్లూ మూన్‌ కనిపిస్తుందని సమాచారం. 


ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి