COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Body Cool Tips In Telugu: ప్రస్తుతం ఎండలో మెండుగా కొడుతున్నాయి. దీనికి కారణంగా వాతావరణం లోని ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయి ప్రజలందరూ అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా బయట ఉష్ణోగ్రతలు కారణంగా కొంతమంది ప్రజలు ఇంటి నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. ప్రస్తుతం చాలామంది ఉదయం ఏడు గంటల లోపే ఏదైనా పనులుంటే చేసుకొని ఎండ ప్రారంభానికి ముందే ఇంటికి చేరుకుంటున్నారు. మరి కొంతమంది అయితే ఎండ వేడి కారణంగా వడదెబ్బ బారిన పడి అనేక రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే పూర్వకాలంలో కూడా ఎండలు విపరీతంగా ఉండేవట, ఈ ఎండల నుంచి ఉపశమనం పొందడానికి మన పూర్వీకులు కొన్ని చిట్కాలు వినియోగించేవారట. వాటిని వినియోగిస్తే ఉష్ణోగ్రతలు ఎంత పెరిగినప్పటికీ మీ శరీరంలోని టెంపరేచర్ మాత్రం ఎప్పటిలాగే ఉంటుంది. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


వేసవిలో చాలామందిలో శరీరంలోని మీరు త్వర త్వరగా చెమట రూపంలో బయటికి వస్తూ ఉంటుంది. కాబట్టి బయటకు నీరును భర్తీ చేయడానికి ప్రతిరోజు సాధారణ రోజులలో తీసుకునే నీటి కంటే ఎక్కువ మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ప్రతిరోజు రెండు లీటర్ల పాటు ఎక్కువగా నీటిని తాగాల్సి ఉంటుంది. అంతేకాకుండా పుచ్చకాయ, కీరదోస వంటి ఎక్కువ నీరు కలిగిన పండ్లను తీసుకోవడం కూడా చాలా మంచిది. కొంతమందిలో శరీరంలోని నీటి శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ నీరసం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి ప్రతిరోజు ఎండాకాలం పండ్లతో తయారు చేసిన రసాలను తాగాల్సి ఉంటుంది.


ఇక మన పూర్వీకులు వేసవికాలంలో భోజనం తర్వాత పుల్లని మజ్జిగ ఎక్కువగా తాగేవారట. ముఖ్యంగా చాలామంది ఇందులో ఎక్కువగా పుదీనా మిశ్రమాన్ని కలుపుకొని తీసుకునే వారట. ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో ఉత్పత్తి అయిన వేడి సులభంగా చల్లగా మారుతుంది. అలాగే కొంతమంది మజ్జిగలో కొత్తిమీర ఆకులతో పాటు సోంపు గింజలు, గులాబీ పువ్వు రెక్కలను వేసుకొని కూడా తాగేవారట.. ఇలా ప్రతిరోజూ తాగడం వల్ల వేసవిలో శరీరంలోని ఉష్ణోగ్రతలు పెరగకుండా ఉండేవని సమాచారం. వీటితోపాటు చాలామంది ప్రతిరోజూ పాల టీకి బదులుగా ఔషధ గుణాలు కలిగిన టీలను తాగేవారు దీనివల్ల ఎండాకాలంలో చెమట కారణంగా వచ్చే చర్మ ఇన్ఫెక్షన్లు కూడా దూరమయ్యేవట.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


అలాగే సాయంత్రం పూట స్నాక్స్‌గా అలవేరాతో తయారు చేసిన సలాడ్స్ ఎక్కువగా తీసుకునేవారట.. వీటిని తీసుకోవడం వల్ల శరీరం ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఎండా కారణంగా వచ్చే సమస్యలు రాకుండా ఉండేవట. ముఖ్యంగా పూర్వీకులు బయటకు వెళ్లే సమయాల్లో ఎక్కువగా వదులుగా ఉండే బట్టలను చెప్పులను ధరించే వారిని సమాచారం. దీంతో పాటు ఎండాకాలం స్కిన్ కేర్ కోసం రసాయనాలతో కూడిన ప్రొడక్షన్ వినియోగించకుండా శాండ‌ల్‌వుడ్ పొడితో తయారుచేసిన  స్కిన్‌కేర్‌ హోమ్ రెమెడీస్‌ వినియోగించేవారట.


మన పూర్వీకులు వేసవికాలంలో రోజులో ఒక్కటైనా కొబ్బరి బొండాల నీటిని తాగే వారట. దీంతోపాటు ఎక్కువగా పోషకాలు కలిగిన ఆహారాలు తీసుకునే వారట. అలాగే ప్రతి రోజు స్నానం చేసే ముందు ఆయిల్‌తో మసాజ్ చేసుకొని చల్లటి నీటితో ప్రతిరోజులో రెండుసార్లు స్నానం చేసేవారు.. దీంతో ఎండా కారణంగా వచ్చే ఎలాంటి ఇన్ఫెక్షన్లైనా సులభంగా దూరమయ్యేవి. అలాగే మన పూర్వీకులు ఎక్కువగా ఎండాకాలం కూరగాయలతో తయారుచేసిన ఆహారాలు మాత్రమే తినేవారు.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి