Childrens Health: మీ పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరగడానికి చిట్కాలు.. ఇవి పాటిస్తే జబ్బు పడరు
Childrens Immune System: ఎదుగుతున్న క్రమంలో మీ పిల్లల్లో మరింత రోగ నిరోధక శక్తి ఉంటే చురుగ్గా వ్యవహరిస్తారు. మీ పిల్లల ఎదుగుదలలో రోగ నిరోధక శక్తి కీలక పాత్ర పోషిస్తుంది. ఆ శక్తి తక్కువగా ఉంటే కొంత ప్రమాదకరమే. అందుకే వైద్యులు పిల్లల రోగ నిరోధక శక్తి పెరుగుదలకు కొన్ని చిట్కాలు ఇస్తున్నారు.
Childrens Health Tips: మీ పిల్లలు తరచూ అనారోగ్యం బారినపడుతుంటే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందని అర్థం. తరచూ జబ్బు పడుతున్న పిల్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దీనికి మారిన జీవనశైలి ఒక కారణంగా చెబుతుంటే.. తల్లిదండ్రులు సరైన విధంగా చర్యలు తీసుకోవడం ఒక కారణం చెబుతున్నారు. పిల్లలు కదా వారిని సుకుమారంగా.. చాలా జాగ్రత్తగా పెంచడం కూడా ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. పిల్లలకు ఆటలు, వ్యాయామం, బలవర్ధక పోషకాహారం, సరైన నిద్ర వంటివి వారు ఆరోగ్యంగా ఉంటారని సూచిస్తున్నారు. పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెంపొందడానికి వైద్యులు ఇస్తున్న సూచనలు ఇలా ఉన్నాయి.
Also Read: Daughter In Law: కోడలి తిక్క కుదిరింది.. కొడుకు తన తల్లిని సంరక్షించుకుంటే గృహహింసనా? ఇదేం విడ్డూరం
సూక్ష్మజీవులతో కలిసి జీవించడం
తరచూ సూక్ష్మజీవులకు గురికావడం పిల్లలకు చాలా మంచిది. మీ పిల్లల రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. తరచుగా వచ్చే జలుబు విషయమై చింతించకండి. వారు రోగ నిరోధక శక్తిని కలిగి ఉంటారు. పిల్లలకు మట్టి ప్రదేశాల్లో ఆడనివ్వండి. మట్టి తల్లిని పరిచయం చేయాలి. మట్టి ద్వారా కూడా పిల్లలకు కావాల్సిన ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని రకాల సూక్ష్మజీవులు శరీరంలోకి వస్తాయి. వాటి ద్వారా పిల్లల రోగ నిరోధక శక్తికి మేలు చేస్తుంది.
Also Read: Tillu Square Trailer: టిల్లు అనే వాడు కారణజన్ముడు.. ఈసారి గట్టిగానే దెబ్బ తగిలేటట్టున్నది?
తగినంత నిద్ర
నిద్రతో కూడా రోగ నిరోధక శక్తి ఆధారపడి ఉంది. మీ పిల్లలు తగినంత నిద్ర పోయేలా చూసుకోండి. టీనేజర్లకు 8 నుంచి 10 గంటల నిద్ర అవసరం. చిన్నపిల్లలకు సరైన రోగ నిరోధక శక్తి కోసం 12 నుంచి 14 గంటల నిద్ర తప్పనిసరిగా అవసరం. అస్తమానం ఫోన్లు, టీవీలు, కార్టూన్ బొమ్మలు చూడనివ్వకండి.
శుభ్రత అలవాటు చేయాలి
మీ పిల్లలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించాలి. ముఖ్యంగా చేతులు కడుక్కోవడం అలవాటు చేయాలి. భోజనానికి ముందు, తర్వాత శుభ్రంగా కడుక్కోవడం నేర్పించాలి. బయట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత సబ్బు, వెచ్చని నీటితో చేతులు కడుక్కోవడంపై అవగాహన కల్పించాలి. శుభ్రంగా ఉంటే రోగాలు రావనే విషయాలను వివరించాలి. శుభ్రతను మీరు పాటిస్తూ మీ పిల్లలకు నేర్పండి.
వ్యాయామం చేయించాలి
మీ పిల్లలు ఎప్పుడూ హుషారుగా, ఉత్సాహంగా ఉండాలంటే వ్యాయామం చేయించాలి. ఒత్తిడి, ఊబకాయాన్ని ఎదుర్కోవడానికి రోజూవారి శారీరక శ్రమ చేసేలా చేయండి. యోగాను ప్రోత్సహించండి. యోగాసనాలు చేయండి. వారి శరీరాన్ని దృఢంగా, మనసును సంతోషంగా ఉంచడానికి రోజూ 45 నిమిషాల పాటు ఆరుబయట ఆటలు లేదా వ్యాయమం ఉండేలా చూసుకోండి. వారికి నిత్యం శారీరక శ్రమ ఉంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
టీకాలు తప్పనిసరిగా వేయించండి
పిల్లల రోగ్య నిరోధక శక్తి పెరగడానికి టీకాలు ఎంతో దోహదం చేస్తాయి. ఏడాది వయసు నుంచి 5 ఏళ్ల పిల్లలకు టీకాలు తప్పనిసరిగా వేయించాలి. పిల్లల శారీరక ఎదుగుదలలో టీకాలు కీలకం. ఇవి అనేక రకాల ఇన్పెక్షన్‌లకు వ్యతిరేకంగా కృత్రిమ రోగనిరోధక శక్తిని అందిస్తాయి. వైద్యులు సూచించిన టీకాలు సమయానికి విధిగా వేయించండి.
సమతుల ఆహారం అందించండి
పిల్లల రోగ నిరోధక శక్తి పెరగడానికి ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. పండ్లు, మాంసం, గుడ్లు, చేపలు వంటి సముద్రపు ఆహార పదార్థాలు అందించడం వలన పిల్లల రోగ నిరోధక శక్తి పెరుగుదలకు దోహదం చేస్తుంది. వారానికోసారి.. నెలకోసారి పోషకాలు అందించాలి. ఇక పాల పదార్థాలు కూడా అందించాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook