Diwali decoration: చీకటిని తరిమికొట్టి మన జీవితాల్లో వెలుగు నింపే దీపావళి ని మనం దీపాలతో స్వాగతిస్తాం. ఆరోజు ప్రతి ఒక్కరూ తమ ఇంటిని ఎంతో అందంగా తీర్చిదిద్దాలి అని అనుకుంటారు. మన పురాణాల ప్రకారం ఆ రోజు సాయంత్రం సాక్షాత్తు మహాలక్ష్మి దేవి ప్రతి ఇంటికి వస్తుందట.. అందుకే ఆరోజు ఇంటిని అందంగా తీర్చిదిద్ది.. అమ్మవారు ఇష్టంగా మన ఇంట్లో కొలువై ఉండాలి అని అందరూ ఆశిస్తారు. మరి అలాంటి దీపావళి పండగకు సులభంగా పెద్దగా ఖర్చు లేకుండా ఎలా డెకరేట్ చేయాలో చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీపావళికి ఎక్కువగా బయట కాంపౌండ్ వాల్, మేడ పైన గోడలు.. గ్రిల్స్ ఇలా అన్ని స్థలాలలో దీపాలను వెలిగిస్తాము. కానీ అలా పెట్టేటప్పుడు దీపాల నుంచి కారే నూనె కారణంగా గోడలపై మరకలు పడతాయి. మరి ఇలా కాకుండా ఉండాలి అంటే ప్రతి దీపం కింద ముగ్గు పిండి గుండ్రంగా వేసి దానిపై దీపాన్ని పెట్టండి. ఒకవేళ నూనె కారిన దాన్ని ముగ్గుపిండి పీల్చుకుంటుంది కాబట్టి గోడలకు మరకలు అంటవు. ముగ్గు పిండి స్థానంలో ఇసుకను కూడా వాడవచ్చు. అంతేకాదు ప్రస్తుతం అమెజాన్ లాంటి సైట్స్ లో నీళ్లు పోస్తే వెలిగే ఎల్ఈడి లైట్లు కూడా వచ్చేసాయి.. కాబట్టి ఒకసారి అవి కూడా మీకు పనికొస్తాయేమో చూడండి.


ఇక మీరు దీపాలు ఎలా ఎక్కడ డెకరేట్ చేయాలి అనుకుంటున్నారు అన్న విషయం పై స్పష్టత ఏర్పాటు చేసుకోవాలి. ఆ ప్రదేశాలలో సులభంగా మంట అంటుకునే కర్టన్స్ ,టాయ్స్ లాంటివి లేకుండా చూసుకోవాలి. దీపాలు అంటించే ప్రదేశాలలో ఎటువంటి ప్రమాదాలకు తావు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోండి.


దీపం పెట్టే ప్రతి ప్రదేశంలో పువ్వులతో ముగ్గు వేయాలి అంటే అందరికీ కుదరదు. దీనికి సులభంగా బయట రెడీమేడ్ ఫ్లవర్స్ తో చేసిన చిన్ని చిన్ని క్లాత్ రంగోలీస్ దొరుకుతాయి. ఇలా డెకరేట్ చేసి మధ్యలో దీపాలను పెట్టడం వల్ల ఇల్లు చాలా కాంతివంతం ఉంటుంది.


మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే కరెంట్ లైట్స్ అవి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. సీరియల్ లైట్స్ ఉపయోగించడం కంటే కూడా బ్యాటరీతో పనిచేసే ఫేరీ లైట్స్ వాడటం మంచిది. వీటివల్ల షాక్ కొట్టి ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది.. పైగా ఇది కావాల్సిన దగ్గర నీట్ గా అరేంజ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న ఖాళీ గ్లాస్ బౌల్స్ లో ఫ్లోటింగ్ క్యాండిల్స్ ,ఫ్లవర్స్ పెట్టి ఇంటి గుమ్మాల దగ్గర.. డైనింగ్ టేబుల్ పైన డెకరేట్ చేసుకోవచ్చు. ఫ్లవర్ వాజ్ లో కూడా ఫేరీ లైట్స్ అరేంజ్ చేస్తే మీ ఇల్లు మెరుస్తున్న పూలవనంలా ఉంటుంది. 


ఈ చిన్ని పాటి ఐడియాస్ తో ఈ దీపావళికి మీ ఇంటిని అందంగా అలంకరించుకోండి.


Also Read: Kalabhavan Haneef: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ హాస్య నటుడు కన్నుమూత


Also Read: Reservation Bill: కులాల రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం.. ఆ రాష్ట్రంలో 75 శాతం రిజర్వేషన్లు   



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook