Reservation Bill: కులాల రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం.. ఆ రాష్ట్రంలో 75 శాతం రిజర్వేషన్లు

Bihar Reservation Bill: కులాల రిజర్వేషన్ బిల్లుకు బీహార్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీంతో రిజర్వేషన్లు 50 శాతం నుంచి 65 శాతానికి పెరగనున్నాయి. ఇప్పటికే అమలవుతున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10 శాతం కలిపితే.. మొత్తం రాష్ట్రంలో రిజర్వేషన్లు 75 శాతానికి చేరుకోనుంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 9, 2023, 05:05 PM IST
Reservation Bill: కులాల రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం.. ఆ రాష్ట్రంలో 75 శాతం రిజర్వేషన్లు

Bihar Reservation Bill: బీహార్‌ ప్రభుత్వం కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ), వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ల పరిమితి పెంపునకు సంబంధించిన బిల్లుకు గురువారం అసెంబ్లీ ఆమోదం తెలిపింది. రిజర్వేషన్లను 50 శాతం నుంచి 65 శాతానికి పెంచాలనే ప్రతిపాదన ఉంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌తో కలిపితే 75 శాతానికి చేరుకుంటుంది. ఈ బిల్లుకు అసెంబ్లీలో బీజేపీ కూడా మద్దతు ఇచ్చింది. SC 20 శాతం, ST 2 శాతం, OBC, EBC రిజర్వేషన్లు 43 శాతానికి రిజర్వేషన్లు పెరగనున్నాయి. గవర్నర్ ఆమోదం పొందితే.. రిజర్వేషన్ల పరిమితి 50 శాతం దాటుతుంది. ప్రస్తుతం 65 శాతం రిజర్వేషన్లు.. ఇప్పటికే EWS కోసం ప్రత్యేకమైన 10 శాతం రిజర్వేషన్లు కొనసాతాయి. మొత్తంగా రాష్ట్రంలో  75 శాతం రిజర్వేషన్ కేటాయింపు జరుగుతుంది.

రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన కుల ఆధారిత సర్వే ఆధారంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రిజర్వేషన్ల పెంపుదల ప్రతిపాదించారు. OBC, EBS కోటాను 30 నుంచి 43 శాతానికి, షెడ్యూల్డ్ కులాల కేటాయింపు 16 నుంచి 20 శాతానికి, షెడ్యూల్డ్ తెగకు 1 నుంచి 2 శాతం పెంపునకు బిల్లు ప్రతిపాదించారు. అయితే ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EWS) రిజర్వేషన్లు ప్రస్తుత 10 శాతం వద్ద మారవు. మొత్తం కలిపితే 75 శాతం వరకు ఉంటాయి. కుల ఆధారిత జనాభా సర్వే ప్రకారం OBC 27.13 శాతం, EBC 36 శాతం, SC, STలకు సామూహిక 21 శాతం మంది ఉన్నారు. అసెంబ్లీ సమర్పించిన నివేదిక రాష్ట్రంలో 2.97 కోట్ల కుటుంబాలకు వర్తించనుంది. 94 లక్షల (34.13 శాతం) మంది నెలవారీ ఆదాయం రూ.6 వేల లేదా అంతకంటే తక్కువపై ఆధారపడి జీవిస్తున్నారు.

బీహార్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల నాలుగో రోజు గురువారం రిజర్వేషన్ సవరణ బిల్లు 2023ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. బిల్లులో EWS రిజర్వేషన్ ప్రస్తావన లేకపోవడంపై ఆందోళన వ్యక్తం అయినా.. బీజేపీ బిల్లుకు బహిరంగంగా మద్దతు ఇచ్చింది. శాసనమండలి, గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత బిల్లు చట్టంగా మారుతుంది. కేంద్ర ప్రభుత్వం కుల గణన చేపట్టి రిజర్వేషన్లు పెంచాలన్న డిమాండ్‌ను నితీశ్ కుమార్ గుర్తుచేశారు. 

Also Read: Festival Of Dreams: క్రోమాలో ఎలక్ట్రిక్‌ వస్తువులపై పిచ్చెక్కించే దీపావళి ఆఫర్స్‌..టీవీ, ఫ్రిజ్డ్‌లపై 50 శాతం తగ్గింపు!

Also Read: Realme Gt 5 Pro Price: శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Realme Gt 5 Pro మొబైల్‌..ఫీచర్స్‌, ధర వివరాలు ఇవే!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News