Train To Moon, Mars: మనిషి తలుచుకుంటే సాధించాలనే ఏది లేదు. అదిమ కాలం నుండి ఆధునిక యుగం వరకు ఎన్నో ఆవిష్కరణలు చేశాడు మానవుడు. ఒకప్పుడు చంద్రుడిపై కాలు మోపడమో గొప్ప అనుకునే వారు.. ఇప్పుడు ఏకంగా చందమామపైకి ట్రైన్ (Train To Moon) నడిపేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు శాస్త్రవేత్తలు. తాజాగా ప్రజలను బుల్లెట్ రైలులో భూమి నుండి మూన్ పైకి తీసుకెళ్లాలని జపాన్ ప్రభుత్వం (Japan Govt) నిర్ణయించుకుంది. ఇది విజయవంతం అయితే అంగారకుడిపైకి కూడా రైలు నడుపుతుందట. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జపాన్‌ పరిశోధకులు (Japan Researchers) ఇటీవల భూమి, చంద్రుడు మరియు అంగారక గ్రహాలను కలిపే కృత్రిమ అంతరిక్ష నివాసం మరియు అంతర్-గ్రహ రైలు వ్యవస్థ కోసం ఇటీవల కొత్త ప్రణాళికలను ఆవిష్కరించారు. "ఇతర దేశాల అంతరిక్ష అభివృద్ధి ప్రణాళికలలో ఇలాంటి ఫ్లాన్ లేదు" అని క్యోటో విశ్వవిద్యాలయం యొక్క SIC హ్యూమన్ స్పేస్‌లజీ సెంటర్ డైరెక్టర్ యోసుకే యమషికి తెలిపారు. ఇందులో భాగంగానే వాతావరణాన్ని ప్రతిబింబించే "ది గ్లాస్" నివాస నిర్మాణాన్ని చంద్రుడిపై అభివృద్ధి చేయాలని యోచిస్తున్నారు. చంద్రుడి కంటే ఆరు రెట్లు ఎక్కువ ఉన్న భూమి గురుత్వాకర్షణ శక్తిని పునఃసృష్టి చేయడానికి తాము భ్రమణ కదలికల ద్వారా సెంట్రిఫ్యూగల్ బలాన్ని ఉపయోగిస్తామని వారు వెల్లడించారు. 


మన జీవించే విధంగా చంద్రునిపై ఈ గ్లాస్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. చంద్రునిపై ఉన్న దానిని "లూనాగ్లాస్" అని, అంగారక గ్రహంపై ఉండే ఆవాసాన్ని "మార్స్‌గ్లాస్" అని పిలుస్తారు. దీనిని 2050 నాటికి పూర్తి చేయాలనకుంటున్నారు. క్యోటో యూనివర్సిటీ, కజిమా కన్‌స్ట్రక్షన్‌లు కలిసి ఈ మెగా ప్రాజెక్ట్ లో పాలుపంచుకోనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు చంద్రునిపై శాశ్వత స్థావరాలను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నాయి.  అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా 2025 కంటే ముందుగానే అక్కడకు మానవులను తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది. రష్యా, చైనాలు కూడా ఈ విషయంలో జోరు పెంచాయి.  


Also Read: Goat Crying Video: యజమానిని కౌగిలించుకుని ఏడ్చేసిన మేక.. హృదయాలను పిండేస్తున్న దృశ్యం!



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook