Ayurvedic Herbs benefits: ఆయుర్వేద మూలికలను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.  వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అలసట, డయాబెటిస్, గుండె జబ్బుల నుండి రక్షణతో సహా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలకు ఆయుర్వేద మూలికలు మూలమవున్నాయి. శ‌రీర ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచే ఆయుర్వేద మూలిక‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అశ్వగంధ: ప్రస్తుత కాలంలో చాలామంది పని ఒత్తిడిని, జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ అశ్వగంధ మూలికలను తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. 


తులసి ఆకులు: తులసి ఆకులు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఇన్‌ ప్లామటరీ గుణాలు దాగి ఉంటాయి. దీని తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు, గ్యాస్‌ సమస్యలు తగ్గుతాయి. 


షిలాజిత్: జీర్ణశక్తి మెరుగుపరచడంలో, శరీరం దృఢంగా ఉంచడంలో షిలాజిత్‌ ఎంతో సహాయపడుతుంది.  ఇందులో మినరల్స్‌ అధికంగా లభిస్తాయి.


ఉసిరికాయ‌: ఉసిరికాయలలో విటమిన్‌ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి. దీని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. అంతే కాకుండా అనారోగ్య సమస్యల బారిన పడకుండా సహాయపడుతుంది.


తిప్పతీగ: ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో తిప్పతీగ ఎంతో సహాయపడుతుంది. రోగాల బారిన పడకుండా రక్షిస్తుంది.


స‌ర‌స్వ‌తి ఆకు: ఈ సరస్వతి ఆకు తీసుకోవడం వల్ల మెదడు పనితీరు చురుకుగా ఉంటుంది. మానసిక ఆరోగ్యాన్ని అందించడంలో ఈ మొక్క ఎంతో సహాయపడుతుంది.


బ్ర‌హ్మి మొక్క‌: బ్ర‌హ్మి మొక్క‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల కూడా శ‌రీర ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచ‌డంలో దోహ‌ద‌ప‌డుతుంది. 


Also Read  Asthma health tips: ఆస్తమా సమస్యకు చెక్‌ పెట్టండి ఇలా!


రేగుట మొక్క: దీనిలో విట‌మిన్లు, మినరల్స్‌ అధికంగా లభిస్తాయి. దీని తీసుకోవడం వల్ల జీవశక్తిని పెంచుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.


తేనె: తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. బరువు తగ్గడంతో పాటు అనేక చర్మ సమస్యలను తగ్గించడంలో  ప్రభావవంతంగా పని చేస్తుంది.


ఈ విధంగా ఈ మూలిక‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీర ఆరోగ్యంతో పాటు దీర్ఘాయువును కూడా సొంతం చేసుకోవ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.


Also Read  Ragi Malt: రాగి మాల్ట్ ష‌ర్బ‌త్‌ ఆరోగ్యానికి ఏంతో శ్రేయస్కరం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter