Camel Milk Benefits: ఒంటె పాలు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటామని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఈ ఒంటె పాలు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఈ ఒంటె పాలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, పోషకాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒంటె పాలలో అధిక శాతం విటమిన్లు, ప్రోటీన్లు,  మంచి కొవ్వులు ఇలా అనేక పోషకాలు లభిస్తాయి. కొంతమంది ఆవు పాలు తీసుకోవడం వల్ల  అలెర్జీలు, అనారోగ్య సమస్యల బారిన పడుతూ ఉంటారు. కాబట్టి ఈ  ఒంటె పాలు తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆవు పాలతో పోలిస్తే ఒంటె పాలలో విటమిన్ సి అధికంగా ఉంటుందని పరిశోధనలో తేలింది. అయితే ఒంటె పాలు బ్యాక్టీరియా, క్రిముల యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి  ఉంటాయి.


ఈ ఒంటె పాలను టైప్‌-డయాబెటిస్‌ ఉన్నవారు తీసుకోవడం వల్ల  షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్‌లో ఉంటాయి. అంతేకాకుండా జీర్ణవ్యవస్థ సమస్యతో బాధపడుతున్నవారు ఈ ఒంటె పాలు తాగడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. అలాగే ఒంటె పాలు తీసుకోవడం వల్ల క్యాన్సర్‌ నిరోధక లక్షణాలను తొలగించవచ్చు.  ఒంటె పాలు వివిధ ఆరోగ్య ప్రయోజనాలతో బయోయాక్టివ్ పెప్టైడ్‌ల గొప్ప మూలంగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.


ఒంటె పాలలు తీసుకోవడం వల్ల అధిక శాతం ప్రొటీన్‌ ను సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా దీని వల్ల ఆకలిని తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా చర్మ సమస్యలు నుంచి కూడా ఎంతో రక్షిస్తుంది. దీనిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది.


Also read: Skin Care Tips: ముఖం రోజురోజుకు నల్లగా మారుతోందా? ఈ రెండే రెండు చిట్కాలతో నిగారింపు చర్మం మీ సొంతం..


లివర్‌, మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్నవారు వీరు ప్రతిరోజు ఈ ఒంటె పాలు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడుతారు. ఇమ్యూన్ వ్యాధులతో బాధపడుతున్నవారు కూడా ఈ ఒంటె పాలు తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. కాబట్టి మీరు కూడా ఆవు పాలు బదులుగా ఈ ఒంటె పాలు లభిస్తే వీటిని తప్పకుండా మీ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలను పొందుతారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.


Also read: Green Peas: పచ్చి బఠానీలు ఎక్కువగా తింటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter