Carrot Juice Health Benefits: శరీరానికి ఆరోగ్యంగా ఉంచడంలో క్యారెట్‌ ఎంతో ఉపయోగపడుతుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. దీని తీసుకోవడం వల్ల కంటి చూపు మాత్రమే కాకుండా వివిధ ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.  అయితే క్యారెట్‌ నెరుగా తీసుకోవడానికి ఇష్టపడని వారు దీని జ్యూస్‌లా తయారు చేసుకొని తాగవచ్చు. అయితే క్యారెట్‌ జ్యూస్‌ తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్యారెట్‌ జ్యూస్‌ వల్ల కలిగే లాభాలు: 


క్యారెట్‌ జ్యూస్‌లో బీటా కెరోటిన్‌ ,  విటమిన్‌ ఎ అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. అంతేకాకుండా వివిధ కంటి సమస్యలు కూడా దూరం అవుతాయి. దీంతో పాటు విటమిన్‌ సి ఇందులో ఉండటం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లలు అంటువ్యాధులకు గురయ్యే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 


గుండె సంబంధిత సమస్యలను తొలగించడంలో క్యారెట్‌ జ్యూస్‌ సహాయపడుతుంది. ఇందులోని పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో ఎంతో ఉపయోగపడుతుంది. కాంతివంతమైన చర్మం కోసం క్యారెట్‌ జ్యూస్‌ ఎంతో ఉపయోగపడుతుంది. దీని వల్ల చర్మం హైడ్రేట్‌గా , ఎలాంటి చర్మ సమస్యల బారిన పడకుండా ఉంటుంది. 


మలబద్దకం, గ్యాస్‌, ఉబ్బరం వంటి సమస్యలను తొలగించడంలో కూడా ఈ క్యారెట్‌ జ్యూస్‌ సహాయపడుతుంది. ఇందులోని ఫైబర్ కంటెంట్‌ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.


కావలసిన పదార్థాలు:


* 4 పెద్ద క్యారెట్లు, తోలు తీసి ముక్కలుగా చేసుకోవాలి
* 1/2 అంగుళం అల్లం ముక్క
* 1/2 నిమ్మరసం 
* 1 టేబుల్ స్పూన్ తేనె 
* 1/2 కప్పు నీరు (అవసరమైతే)


తయారీ విధానం:


ఒక మిక్సర్ జార్ లో క్యారెట్ ముక్కలు, అల్లం ముక్కలు, నిమ్మరసం, తేనె వేసి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అవసరమైతే, కొద్దిగా నీరు కలపండి. దీని వల్ల జ్యూస్‌ పలుచగా తయారు అవుతుంది. ఆ తరువాత జ్యూస్‌ను గ్లాసులోకి తీసుకోవాలి. ఈ విధంగా మీరు క్యారెట్‌ జ్యూస్‌ను తయారు చేసుకోవచ్చు. 


చిట్కాలు:


* మరింత రుచి కోసం, మీరు జ్యూస్ లో ఒక చిన్న ముక్క అల్లం లేదా పుదీనా ఆకులు కూడా వేయవచ్చు.
* క్యారెట్ జ్యూస్ ను మరింత చల్లగా తాగడానికి, మీరు దానిని ఫ్రిజ్ లో 30 నిమిషాలు ఉంచవచ్చు.
* క్యారెట్ జ్యూస్ లో విటమిన్ ఎ, సి, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి  దృష్టిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.


క్యారెట్ జ్యూస్ తో పాటు కొన్ని ఆరోగ్యకరమైన వంటకాలు:


* క్యారెట్ సలాడ్: క్యారెట్లను తురిమిన తర్వాత వాటిని నిమ్మరసం, ఉప్పు,  మిరియాలు కలిపి సలాడ్ గా తినవచ్చు.


* క్యారెట్ సూప్: క్యారెట్లను ఉడికించి, వాటిని మెత్తగా పేస్ట్ చేసి, ఉప్పు, మిరియాలు కొద్దిగా పాలు కలిపి సూప్ గా చేసుకోవచ్చు.


* క్యారెట్ హల్వా: క్యారెట్లను తురిమిన తర్వాత వాటిని నెయ్యి, పాలు, పంచదార, యాలకుల పొడి కలిపి హల్వా గా చేసుకోవచ్చు.


గమనిక: 


క్యారెట్‌ జ్యూస్ అధికంగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుంది. దీని వల్ల కడుపు నొప్పి, వికారం వంటి సమస్యలు కలుగుతాయి. అంతేకాకుండా డయాబెటిస్‌ సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు దీనిని తీసుకొనే ముందు మీరు వైద్యుడిని సంప్రదించడం చాలా మంచిది. 


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి