Chia Seeds Benefits: చియా సీడ్స్ వాటర్ ఈ సమస్యలు ఉన్నవారు చలికాలంలో తప్పకుండా తాగండి!
Chia Seeds Benefits In Telugu: చియా సీడ్స్ వాటర్ రోజు తాగితే శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీర బరువును నియంత్రించేందుకు కూడా సహాయపడుతుంది. అలాగే చర్మ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
Chia Seeds Benefits: చియా సీడ్స్‌లో పోషకాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఆహారాల్లో భాగంగా వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపులున్నారు. ముఖ్యంగా చియా సీడ్స్‌లో ప్రోటీన్, ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ మోతాదులో లభిస్తాయి. రోజు ఈ సీడ్స్‌ను నీటిలో కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు జీరక్రియ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
చియా సీడ్స్ వాటర్ తాగడం ప్రయోజనాలు:
జీర్ణక్రియ సమస్యలు:
చియా సీడ్స్ నానబెట్టిన వాటర్‌లో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి రోజు ఈ వాటర్‌ను తాగడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా తయారవుతుంది. అంతేకాకుండా మలబద్ధకం నుంచి సులభంగా ఉపశమనం కలుగుతుంది.
బరువు తగ్గేందుకు:
బరువు తగ్గాలనకునేవారికి చియా సీడ్స్ వరం కంటే ఎక్కువని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు ఆకలిని నియంత్రించేందుకు సహాయడుతుంది. అలాగే అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు నుంచి విముక్తి కలిగిస్తుంది.
గుండె ఆరోగ్యానికి మేలు:
చియా సీడ్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా మోతాదులో అందుబాటులో ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యవంతంగా చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు రక్తపోటు సమస్యలను తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది.
ఎముకలు బలపడతాయి:
చియా సీడ్స్‌లో కాల్షియంతో పాటు ఫాస్ఫరస్ పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి చీయా సీడ్స్‌ను ప్రతి రోజు వాటర్‌లో నానబెట్టి తీసుకోవడం వల్ల ఎముకలు కూడా ఆరోగ్యవంతంగా తయారవుతాయి. అలాగే ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది.
చర్మం ఆరోగ్యం:
చియా సీడ్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు చియా సీడ్స్ వాటర్ రోజు తాగడం వల్ల చర్మ సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా ఇవి చర్మంపై మచ్చలను తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది.
శక్తిని అందిస్తుంది:
చియా సీడ్స్‌లో ప్రోటీన్లు, పిండి పదార్థాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, పీచుపదార్థాలు ఎక్కువ మోతాదులో లభిస్తాయి. కాబట్టి రోజు ఉదయం పూట చియా సీడ్స్ వాటర్ తాగడం వల్ల రోజంతా ఆరోగ్యవంతంగా ఉంటారు. దీంతో పాటు రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి.
ఇదీ చదవండి: మాజీ మంత్రి ఎన్సీపీ లీడర్ బాబా సిద్ధిఖీ దారుణ హత్య.. సల్మాన్ ఖాన్‌కు ఈ మర్డర్‌తో ఉన్న లింక్ అదేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.