Chia Seeds Health Benefits: ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల మన శరీర ఆరోగ్యం కూడా బాగుంటుంది. ముఖ్యంగా ఖనిజాలు పుష్కలంగా ఉండే ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అంతేకాదు విటమిన్స్, మినరల్స్  యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీర పనితీరును మెరుగు చేస్తాయి. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. చియా సీడ్స్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బ్రేక్ ఫాస్ట్ స్నాక్స్ రూపంలో తీసుకుని చియా సీడ్స్ ట్రెండ్ ఇప్పుడు విపరీతంగా పెరిగింది.  చియా సీడ్స్ లో ఖనిజాలు ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ,ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు  చియా సీడ్స్ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి మంచిది. మీరు తీసుకునే యోగార్ట్‌లో పైనుంచి కాస్త  చియా సీడ్స్ వేసుకున్న సరిపోతుంది. ఇవి స్మూథీస్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు వీటిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.


గుండె ఆరోగ్యం..
చియా సీడ్స్  డైట్లో చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ,ఫైబర్, ఆంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇది మంట సమస్యను తగ్గించి కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గించేస్తుంది. మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల కార్డియో ఆరోగ్యంగా బాగుంటుంది  చియా సీడ్స్ గుండె పనితీరు కూడా మెరుగుపడుతుందిజ ఇందులో కరిగే ఫైబర్ ఉంటుంది రక్తంలో బ్లడ్ చెడు కొలెస్ట్రాల్ ని తొలగించేస్తుంది. దీంతో గుండెలో రక్తం గడ్డ కట్టడం వంటి సమస్యలు ఉండవు.


ఫైబర్..
ప్రతిరోజు మీ డైట్ లో చియా సీడ్స్ చేర్చుకోవడం వల్ల ఇది రక్తప్రసరణను మెరుగు చేస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలు మెల్లిగా కలుస్తాయి. రక్తంలో హఠాత్తుగా షుగర్ లెవల్స్‌ పెరుగనివ్వవు. శరీరంలో శక్తిని కూడా విడుదల చేస్తాయి. డయాబెటిస్తో బాధపడేవారు బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుకోవడానికి చియా సీడ్స్ డైట్ లో చేర్చుకోవాలి.


ఇదీ చదవండి: నోరూరించే  రొయ్యల కూర ఇలా వండుకుంటే నోట్లో కరిగిపోతుంది అంతే..


శక్తి స్థాయిలు..
చియా సీడ్స్ మన శరీరానికి శక్తి స్థాయిలను పెంచుతాయి. ఎందుకంటే ఇందులో మెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫైబర్ ఉంటుంది. ఇది శక్తిని విడుదల చేస్తుంది.


ఎముక ఆరోగ్యం..
 చియా సీడ్స్ మీ డైట్లో చేర్చుకోవడం వల్ల ఇందులో ఉండే క్యాల్షియం , ఫాస్ఫరస్, మెగ్నీషియం ఎముక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. క్యాల్షియం ఎముకలకు ఎంతో అవసరం మెగ్నీషియం క్యాల్షియం గ్రహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎముక సంబందించిన సమస్యలు ఉండవు. ఆస్టియో పోరోసిస్‌ రాకుండా కూడా  చియా సీడ్స్ చేస్తుంది.


ఇదీ చదవండి: ముఖం పై ట్యాన్ పోవట్లేదా? ఈ ఈజీ హోమ్ రెమిడీ తో చెక్ పెట్టండి..


బరువునిర్వహణ..
చియా సీడ్స్ బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ప్రోటీన్ ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. నానబెట్టి  చియా సీడ్స్ తీసుకుంటే జెల్ లాంటిది ఏర్పడుతుంది. ఇది కడుపు నిండిన అనుభూతిని ఎక్కువ సమయం పాటు కలిగిస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter