Coconut Oil Benefits: కొబ్బరి నూనె ఆరోగ్యరీత్యా చాలా ప్రయోజనకారి. ప్రత్యేకించి ముఖ సౌందర్యం కోసం. ఆశ్చర్యంగా ఉందా..ముఖ సౌందర్యానికి కొబ్బరి నూనె ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అందమైన ముఖం, ముఖ సౌందర్యం అందరూ కోరుకునేదే. కానీ మారుతున్న ఆధునిక జీవనశైలి కారణంగా ముఖంలో కాంతి కూడా పోతోంది. ముడతలు ప్రారంభమైపోతున్నాయి. అయితే ఈ రెండింటి నుంచి మీ ముఖాన్ని సంరక్షించుకునేందుకు కొబ్బరి నూనె అద్భుతంగా పనిచేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వయస్సు పెరిగే కొద్దీ ముఖంపై ముడతలు ఎక్కువవుతుంటాయి. వీటి నుంచి విముక్తి పొందేందుకు కొబ్బరినూనె సరైన ప్రత్యామ్నాయం. అంతేకాకుండా కొబ్బరినూనెతో చాలా ఇతర సమస్యలు దూరమౌతాయి. ముఖ సౌందర్యం కోసం కొబ్బరి నూనె ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. 


కొబ్బరినూనెలో ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలుంటాయి. అందుకే ఈ నూనె సీరమ్‌లా కూడా పనిచేస్తుంది. కొబ్బరి నూనెను ముఖానికి రాయడం వల్ల ముఖం కాంతి పెరుగుతుంది. కొబ్బరి నూనెలో విటమిన్ ఇ సమృద్ధిగా ఉండటం వల్ల..ముఖానికి రాస్తే..ముఖానికి కాంతి వస్తుంది. రాత్రి సమయంలో నిద్రపోయేముందు రాసుకుని..ఉదయం చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. 


మరోవైపు ముఖంపై ముడతల పడే సమస్యను కూడా కొబ్బరి నూనె దూరం చేస్తుంది. మీకు కూడా ఈ సమస్య ఉంటే కొబ్బరి నూనె తప్పకుండా రాయాలి. కొబ్బరి నూనెలో యాంటీ ఏజీయింగ్ గుణాల కారణంగా..మీ ముఖంపై ముడతలు దూరమౌతాయి. వాతావరణం మారుతూనే చాలామంది ముఖం డ్రైగా మారుతుంటుంది. ఈ పరిస్థితుల్లో మీరు ముఖం డ్రైగా ఉండకుండా చూసుకోవాలి. దీనికోసం కొబ్బరి నూనె మంచి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. ముఖంపై తేమను సరిచేస్తుంది. 


కాలుష్యం, క్రమ పద్ధతిగా లేని ఆహారపు అలవాట్లతో ముఖంపై రకరకాల మచ్చలు పడుతుంటాయి. ఈ మచ్చల్ని దూరం చేయాలంటే కొబ్బరి నూనె క్రమం తప్పకుండా వాడాలి. రోజూ రాత్రివేళ పడుకునేముందు..చేతిలో కొబ్బరి నూనె తీసుుకునని ముఖానికి మస్సాజ్ చేసుకోవలి. దాదాపు 5-10 నిమిషాలకు మస్సాజ్ తరువాత అలాగే వదిలేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితాలుంటాయి.


Also read: Fathers Day 2022: ఫాదర్స్ డే ప్రాముఖ్యత, చరిత్ర ఏంటి, ఫాదర్స్ డే ఎలా జరుపుకోవాలి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook