COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Common Causes Of Foamy Urine: కాలేయం, మూత్రపిండాలు, మధుమేహం వ్యాధితో బాధపడేవారిని గుర్తించేందుకు వైద్యులు మూత్ర పరీక్షలను నిర్వహిస్తారు..దీని వల్ల శరీరంలో ఏవైన అనారోగ్య సమస్యలున్న సులభంగా దోరికి పోతాయి. అయితే చాలా మంది మూత్రం రంగు, వాసనలో మార్పు వస్తూ ఉంటాయి. దీంతో పాటు కొంతమందిలో మూత్రంలో నురుగు కూడా వస్తూ ఉంటుంది. దీని కారణంగా చాలా మంది టెన్షన్ పడుతుంటారు. అయితే తరచుగా నురుగు రావడం వల్ల ఏవైన వ్యాధుల వచ్చే అవకాశాలున్నాయా?..ఇది రావడానికి గల కారణాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


మూత్రంలో నురుగు రావడానికి కారణాలు:
నురుగుతో కూడిన మూత్రం రావడానికి ప్రధాన కారణం..ఎంతో ఒత్తిడితో మూత్రాన్ని బయటికి వదలడమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమస్యతో తరుచుగా బాధపడేవారు టెన్షన్ పడొద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఈ కింది కారణాల వల్ల కూడా మూత్రంలో నురుగు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..


నిర్జలీకరణం:
శరీరంలో నీటి కోరత కారణంగా కూడా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలాంటి సమస్య కారణంగా మొదట మూత్రం ముదురు పసుపు రంగులో కనిపించి..మూత్రంలో నురుగు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొందరిలో నీటి కోరత కారణంగా ప్రోటీన్ మూత్రంలో కరిగి నురుగు వచ్చే ఛాన్స్‌లు వచ్చే ఛాన్స్‌ కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 


కిడ్నీ సమస్య:
కొంతమందిలో కిడ్నీ సమస్యల కారణంగా మూత్రంలో నిరంతంరం నురుగు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కొంతమందిలో మూత్రపిండల వ్యాధైన ప్రోటీన్యూరియాకు సంకేతం కావచ్చు.


రెట్రోగ్రేడ్ స్ఖలనం:
రెట్రోగ్రేడ్ స్ఖలనం అనేది పురుషుల్లో వచ్చే వ్యాధి..ఈ వ్యాధి కారణంగా  వీర్యం పురుషాంగం నుంచి బయటకు రాకుండా తిరిగి మూత్రాశయంలోకి వెళ్తుంది. దీంతో కూడా మూత్రం నుంచి నురుగు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.


ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్


నెఫ్రోటిక్ సిండ్రోమ్:


ఈ సమస్యలో, కిడ్నీతో సహా వ్యక్తి శరీరంలోని ఏదైనా భాగాన్ని ప్రభావితం చేయవచ్చు.ఈ సమస్యతో బాధపడుతున్న వ్యక్తి యొక్క మూత్రంలో నురుగు ఏర్పడటం ప్రారంభమవుతుంది. 


అమిలోయిడోసిస్:
అమిలోయిడోసిస్ అనేది చాలా అరుదైన వ్యాధిగా వైద్యులు భావిస్తారు. ఈ వ్యాధి కారణంగా కూడా చాలా మందిలో మూత్రంలో నురుగు వస్తుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. కొంతమందిలో దీని కారణంగా మూత్రపిండాల సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. 


మధుమేహం:
మధుమేహం కారణంగా శరీరంలో అనేక రకాల మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.  వీటిలో ఒకటి మూత్రంలో నురగలు రావడం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి తరచుగా ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా మధుమేహం పరీక్షలను చేయించుకోవాల్సి ఉంటుంది. 


ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి