Constipation: భోజనంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే.. మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ, ఉబ్బరం అస్సలు రావు..
Constipation Home Remedies: ప్రస్తుతం చాలా మంచి పొట్ట సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా పలు రకాల ఆహారాలను ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.
Constipation Home Remedies: ప్రస్తుతం చాలా మంది అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల పొట్ట సమస్యల బారిన పడుతున్నారు. అంతేకాకుండా చాలా మంది చెడు కొలెస్ట్రాల్ సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారు.అయితే ఈ సమస్యల నుంచి ఎంత సులభంగా ఉపశమనం పొందితే అంత మంచిదని ఆరోగ్య నిపుణుల చెబుతున్నారు. లేకపోతే మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ, ఉబ్బరం వంటి తీవ్ర పొట్ట సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా ప్రతి రోజూ తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా అనారోగ్యకరమైన ఆహారాలు తినకపోవడం చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఈ కింది ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పొట్ట సమస్యల నుంచి ఇలా ఉపశమనం పొందండి:
ఇలా ప్రతి రోజూ నీరు తాగండి:
ఆహారం తినడానికి కొద్దిసేపటి ముందు నీరు త్రాగడం చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.ఇలా చేయడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉండడమేకాకుండా అనార్యోగ సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. కాబట్టి శరీరం ఆరోగ్యంగా ఉండడానికి తప్పకుండా రోజంతా కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాల్సి ఉంటుంది. లేదంటే నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినాల్సి వస్తుంది.
పచ్చి అల్లం తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది:
ప్రతి రోజూ అల్లాన్ని ఆహారాల్లో వినియోగిస్తే సులభంగా మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా సీజనల్‌లో వచ్చే వ్యాధుల నుంచి కూడా త్వరగా ఉపశమనం కలుగుతుందని ఆరోగ్యనిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి పొట్ట సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజు అల్లంతో తయారు చేసిన ఆహార పదార్ధాలను తీసుకోవాల్సి ఉంటుంది.
పెరుగు తినండి:
పెరుగు ప్రోబయోటిక్ ఆహారంగా చెప్పుకుంటారు. ఎందుకంటే ఇందులో మంచి బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా పొట్టలోకి అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పెరుగును ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.
నడవడం:
ప్రస్తుతం చాలా మంది ఆహారం తిన్న వేంటనే కుర్చుంటున్నారు. అంతేకాకుండా నిద్రపోతున్నారు. అయితే దీని కారణంగా కూడా చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే తిన్న వెంటనే 10 నుండి 15 నిమిషాలు నడవండి. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు సులభంగా దూరమవుతాయి. ముఖ్యంగా జీర్ణ క్రియ సమస్యలు సులభంగా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Upasana Motherhood : ఈ సంక్రాంతికి మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నా.. ఉపాసన పోస్ట్ వైరల్
Also Read: Nandamuri Balakrishna Controversy : ఆ సందర్భంలో అలవోకగా వచ్చిన మాట మాత్రమే.. క్షమాపణలు కోరిన బాలయ్య
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook