Vegetables For Diabetes: ఈ ఆకులు తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధికి చెక్!
Best Green Vegetables For Diabetes: ప్రస్తుతం డయాబెటిస్ అనేది చాలా సాధారణమైన సమస్యగా మారింది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా చాలామంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఈ సమస్య ఉన్నవారు షుగర్ లెవల్స్ ను కొంట్రోల్‌లో ఉంచుకోవాలి. షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటే తీవ్ర అనారోగ్యసమస్యల బారిన పడుతారు. షుగర్ లెవల్స్ కొంట్రోల్ లో ఉంచాలి అనుకుంటే కొన్ని ఆకుకూరలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి ఆకుకూరలు తీసుకోవడం షుగర్ కొంట్రోల్ లో ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం.
Best Green Vegetables For Diabetes: డయాబెటిస్ ఉన్నవారు సాధారణ వైద్య పరీక్షలు, వ్యాయామాలు , మందుల ద్వారా సమస్యను తగ్గించుకుంటారు. మందులు ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్, అజీర్ణం వంటి ఇతర సమస్యలు తలెత్తుతాయి.మధుమేహం చాలా సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది. డయాబెటిక్ పేషెంట్లు ప్రతి ఇంట్లో కనిపిస్తుంటారు. సాధారణ వైద్య పరీక్షలు, నడక వంటి తేలికపాటి వ్యాయామాలు, మందుల ద్వారా ఇవన్నీ నియంత్రణలో ఉంటాయి. అయితే కొన్ని రకాల ఆకుకూరలు తీసుకోవడం వల్ల షుగర్ కొంట్రోల్‌లో ఉంటుంది. ఎలాంటి ఆకుకూరలు తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది అనేది మనం తెలుసుకుందాం.
కరివేపాకు: కరివేపాకులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. దీనిని తినడం వల్ల షుగర్ లెవల్స్ కొంట్రోల్‌లో ఉంటాయి.
మెంతి ఆకులు: మెంతికూరలో యాంటీ డయాబెటిక్ లక్షణాలున్నాయి. ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి.
జామ ఆకులు: డయాబెటిస్ సమస్య ఉన్నవారు జామ ఆకులు తీసుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. ఈ ఆకుల రసాన్ని తీసుకుని తాగడం వల్ల ఇన్సులిన్ తగిన స్థాయిలో విడుదలవుతుంది.
Also read: Rich Foods For Hair: ఒత్తైన జుట్టు కోసం ఇవి తప్పక తినండి!
తులసి ఆకులు: తులసి ఆకులు డయాబెటిస్ ఉన్నవారిని ఇది ఒక ఔషధంలా పనిచేస్తుంది. ప్రీ-డయాబెటిక్ , డయాబెటిక్ ఉన్నవారు దీన్ని రోజూ తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గిస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
డయాబెటిక్ లక్షణాలు ఉన్నవారు రోజు ఈ ఆకులను తీసుకోవడం వల్ల ప్రయోజనం పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Also read: Heart Problems: ఈ చిట్కాలు పాటించడం వల్ల గుండె సమస్యలకు చెక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter