Coriander Juice Benefits: రోజూ కొత్తిమీర జ్యూస్ తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
Coriander Juice Benefits In Telugu: కొత్తిమీర జ్యూస్ తాగం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు జీర్ణక్రియను రోగ్యంగా చేసేందుకు సహాయపడుతుంది. దీంతో పాటు అనేక సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.
Coriander Juice Benefits In Telugu: కొత్తిమీర లేనిది ఆహార పదార్థాలు ఊహించుకోవడం చాలా కష్టం. ఇది ఫుడ్స్ టేస్ట్‌ను పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఈ కొత్తమీర ఆకులే కాదు వీటి గింజలు కూడా బోలెడు లాభాలను అందిస్తాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలక వ్యాధులను సైతం తగ్గిస్తాయి. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజు కొత్తిమీర రసాన్ని తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే విటమిన్ కె, విటమిన్ సి, విటమిన్స్ శరీరానికి బోలెడు ప్రయోజనాలను అందిస్తాయి. అలాగే ఇందులో ఐరన్, మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఈ జ్యూస్ తాగడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. అయితే రోజు కొత్తిమీర రసం తాగడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
కొత్తిమీర రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
జీర్ణక్రియ సమస్యలకు:
కొత్తిమీర జ్యూస్ తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో శరీరానికి కావాల్సిన ఫైబర్, ఇతర ఎంజైమ్‌లు జీర్ణక్రియను ఆరోగ్యంగా చేసేందుకు ఎంతగానో సహాయపడతాయి. అంతేకాకుండా అజీర్ణం, గ్యాస్, అసిడిటీ సమస్యలను తగ్గించేందుకు కూడా ఎంతగానో కీలక పాత్ర పోషిస్తుంది.
రోగ నిరోధక శక్తి పెంచడం:
కొత్తిమీర జ్యూస్‌లో ఉండే ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి అద్భుతమైన శక్తిని అందిచేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా శరీర రోగనిరోధక శక్తిని పెంచి శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తొలగించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. దీని వల్ల దీర్ఘకాలిక వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి.
చర్మ ఆరోగ్యానికి:
కొత్తిమీరలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు అధిక మోతాదులో లభిస్తాయి. ఇవి చర్మంపై మొటిమలు, మచ్చలు వంటి సమస్యలను తొలగించేందుకు ఎంతగానో సహాయపడతాయి. కాబట్టి ఈ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు తప్పకుండా కొత్తిమీర రసం తాగాల్సి ఉంటుంది. ఈ రసం తాగడం వల్ల చర్మం మృదువుగా, మెరిసిపోయేలా తయారవుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం:
కొత్తిమీర రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇది డయాబెటిస్ ఉన్నవారికి ఔషధం కంటే ఎక్కువ పని చేస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.
గుండె ఆరోగ్యానికి:
కొత్తిమీర జ్యూస్ తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కూడా సులభంగా తగ్గుతుంది. దీని కారణంగా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. దీంతో గుండె సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. తరచుగా గుండె సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ జ్యూస్ తాగాల్సి ఉంటుంది.
మూత్రపిండాల ఆరోగ్యానికి:
కొత్తిమీర జ్యూస్‌లో ఉండే గుణాలు మూత్రపిండాలను శుభ్రంగా చేసేందుకు సహాయపడుతుంది. దీంతో పాటు కిడ్నీ ఫెయిలుర్ సమస్యల నుంచి కూడా విముక్తి కలిగిస్తుంది. అలాగే ఈ జ్యూస్‌లో తక్కువ కేలరీలు లభిస్తాయి. ఇది శరీర బరువును కూడా సులభంగా నియంత్రిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.