Coriander Water: అమ్మమ్మ కాలంలో చేసే కషాయం..జలుబు దగ్గు మాయం అవ్వాల్సిందే!!
Coriander Water Benefits: ధనియాలు కేవలం వంటల్లో మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది చలికాలంలో వచ్చే దగ్గు, జలుబు, జర్వం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ధనియాల కషాయంతో ఎలాంటి సమస్యలైనా వెంటనే ఉపశమన్నాని కలిగిస్తుంది.
Coriander Water Benefits: ధనియాలు అంటే మనకు తెలిసిన మసాలా దినుసు. కానీ దీనిలోని ఔషధ గుణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ ధనియాలను ఉపయోగించి తయారు చేసే కషాయం అనేక ఆరోగ్య సమస్యలకు చక్కటి నివారణ. ముఖ్యంగా చలికాలం వచ్చిందంటే జలుబు, దగ్గు, సీజనల్ జ్వరాలు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మారుతున్న వాతావరణం ఒక్కసారిగా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇలాంటి సమయంలో ధనియాలతో తయారు చేసే కషాయాన్ని తాగడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
ధనియాల కషాయం కేవలం దగ్గు, జర్వం మాత్రమే కాకుండా ఇతర అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ధనియాల కషాయం చర్మాన్ని మృదువుగా చేస్తుంది, ముడతలు తగ్గిస్తుంది, మొటిమలను తొలగిస్తుంది. కషాయంలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటాయి, ఇవి రోగ నిరోధక శక్తిని మెరుగుపరుచుతుంది. కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడతాయి. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది, కంటి ఎర్రబాటును తగ్గిస్తుంది. ధనియాలు రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది, ఇది గుండె ఆరోగ్యానికి చాలా ముఖ్యం.
ధనియాల కషాయం ఎలా తయారు చేయాలి?
కావలసినవి:
ధనియాలు - ఒక టేబుల్ స్పూన్
నీరు - ఒక కప్పు
తయారీ విధానం:
ఒక పాత్రలో నీటిని పోసి బాగా మరిగించాలి. నీరు మరిగించిన తర్వాత వెంటనే ధనియాలను వేసి కప్పు మూతతో మూసి వేయాలి. కొన్ని నిమిషాలు అలాగే ఉంచి, నీరు చల్లారిన తర్వాత వడకట్టుకోవాలి. ఈ వడకట్టిన నీటిని వెచ్చగా లేదా చల్లగా తాగవచ్చు. రుచి కోసం కొద్దిగా తేనె లేదా నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు.
ఎప్పుడు తాగాలి:
ఉదయం ఖాళీ కడుపుతో తాగడం చాలా మంచిది.
రోజుకు ఒకటి లేదా రెండు సార్లు తాగవచ్చు.
ధనియాల కషాయం తీసుకునేటప్పుడు జాగ్రత్తలు:
అధికంగా తీసుకోవడం మంచిది కాదు: ఏదైనా ఆహారం అధికంగా తీసుకుంటే దుష్ప్రభావాలు ఉంటాయి. ధనియాల కషాయం కూడా అంతే. అందుకే నిపుణుల సలహా మేరకే తీసుకోవడం మంచిది.
అలర్జీ: కొంతమందికి ధనియాలకు అలర్జీ ఉండవచ్చు. అలాంటి వారు ధనియాల కషాయం తీసుకోకూడదు. అలర్జీ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
గర్భవతులు, పాలిచ్చే తల్లులు: గర్భవతులు, పాలిచ్చే తల్లులు ధనియాల కషాయం తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి.
మందులు వాడేవారు: ఇప్పటికే ఏదైనా మందులు వాడుతున్నట్లయితే ధనియాల కషాయం తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి. కొన్ని మందులతో ధనియాలు ప్రతిచర్య చూపించే అవకాశం ఉంది.
మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు: మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు ధనియాల కషాయం తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి.
ముగింపు
ధనియాల కషాయం అనేది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న ఒక సహజమైన పానీయం. దీనిని మీ రోజువారీ ఆహారంలో చేర్చడం ద్వారా మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు.
Also Read: Pumpkin Seeds: మేధస్సును పెంచే లడ్డు.. ఆరోగ్యలాభాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.