Cracked Lips Remedies: చలికాలంలో చ‌ల్ల‌ని గాలులు వల్ల పెదవులు, చర్మం పొడిబారుతుంది. పెదవులు పొడిబారడానికి మరో కారణం శరీరంలో నీటి శాతం తగ్గడం, ఏదైన విటమిన లోపం వల్ల ఈ సమస్య వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే కొందమంది మార్కెట్‌లో లభించే లిప్ కేర్, లిప్ బామ్ ల‌ను వాడుతూ ఉంటారు. అయితే ఈ ప్రొడెక్ట్స్‌ కంటే మన ఇంట్లో దొరికే పదార్థాలతో ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.  ఈ చిట్కాలను తప్పకుండా పాటించడం వల్ల మంచి లాభాలు కలుగుతాయి. ఇప్పుడు ఈ  చిట్కాలను తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలోవెరా జెల్‌: పెదవులు పగిలినప్పుడు అలోవెరా జెల్‌ వాడ‌డం వల్ల సమస్య తగ్గుతుంది. దీనిని అరగంట పాటు పెదవులపై ఉంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. పెద‌వులు తేమ‌గా ఉంటాయి. 


వెన్న, చక్కెర: పగిలన పెద‌వుల‌కు వెన్నలో చక్కెర  కలిపి రాసుకోవ‌డం వ‌ల్ల పెదాల పొర‌లు తొల‌గి,పెద‌వులు మృదువుగా మారుతాయి. 


తేనె: పెదవులకు మృదువుగా ఉండాలి అనుకొనే వారు తేనెను తీసుకుని పెదవులపై రాసి మర్ధనా చేయాలి.


Also read: High Bp: హై బీపీ సమస్యతో బాధపడుతున్నారా? ఈ చిట్కాలను ట్రైచేసి చూడండి..


కొబ్బ‌రి నూనె: కొబ్బ‌రి నూనె రాసుకోవ‌డం వ‌ల్ల పెద‌వులు పొడిబార‌కుండా ఉంటాయి.


నువ్వుల నూనె: నువ్వుల నూనెను తీసుకుని పెద‌వుల‌పై రాసి మ‌ర్ద‌నా చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల  పగుళ్లు త‌గ్గుతాయి.


ఈ చిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల పెద‌వుల పగుళ్లు త‌గ్గుతాయి. పెద‌వులు మృదువుగా, అందంగా త‌యార‌వుతాయి.


Also read: Hair Growth Tips: జుట్టు సమస్య ఏదైనా వన్ స్టాప్ సొల్యూషన్..ఈ చిట్కాలతో ఒత్తయిన మందమైన జుట్టు మీ సొంతం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter