Cucumber Facts: రోజు ఉదయాన్నే దోసకాయ తింటే.. భవిష్యత్తులో ఈ రోగాలకు టాబ్లెట్ వేసుకోనక్కర్లేదు!
Cucumber Facts: రోజు దోసకాయను తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీర బరువును నియంత్రించడమే కాకుండా.. వివిధ రకాల క్యాన్సర్ల నుంచి ఉపశమనం కలిగించేందుకు కూడా సహాయపడతాయి. అలాగే పొట్టను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి.
Cucumber Facts: ప్రతిరోజు ఉదయం పూట సలాడ్స్ తినడం చాలా మంచిది. ఇవి పొట్టను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా అన్ని రకాల సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. సలాడ్స్ అంటే చాలామందికి గుర్తొచ్చేది ఎక్కువగా దోసకాయ. దోసకాయతో చేసిన సలాడ్స్ ను ఎక్కువ మంది తినేందుకు ఇంట్రెస్ట్ చూపుతారు. భారతదేశంతో పోలిస్తే ఇతర దేశాల్లో దోసకాయతో తయారుచేసిన సలాడ్లను ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే సలాడ్ల కంటే ప్రతిరోజు దోసకాయ ను ముక్కలుగా కట్ చేసుకుని తినడం వల్ల ఎక్కువగా లాభాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరంలోని జీర్ణ క్రియను ఆరోగ్యవంతంగా చేసేందుకు ఎంతగానో సహాయపడతాయి. అలాగే ఇది తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. కాబట్టి రోజు ఉదయాన్నే దీనిని తినడం వల్ల శరీర బరువు నుంచి విముక్తి పొందుతారు. ఇవే కాకుండా బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి.
రోజూ దోసకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
రోజు ఉదయాన్నే దోసకాయ తినడం వల్ల జీర్ణ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే దోసకాయలో ఎక్కువగా నీటి శాతం ఉంటుంది ఇది జీర్ణ క్రియను శుభ్రం చేసేందుకు సహాయపడుతుంది. తరచుగా మలబద్ధకం అజీర్ణం వంటి సమస్యలతో బాధపడేవారు రోజు దోసకాయను తినడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా దోసకాయలు కేలరీలు తక్కువగా ఉంటాయి దీనికి తోడు ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల శరీర బరువును నియంత్రించేందుకు కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా డైట్లో దోసకాయను చేర్చుకోవడం ఎంతో మంచిది. దోసకాయ తింటే పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. అలాగే దోసకాయలు 96% కు పైగా నీరు ఉంటుంది. కాబట్టి డీహైడ్రేషన్ సమస్యలతో బాధపడుతున్న వారు కూడా దీనిని ఉదయం పూట తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
దోసకాయలు యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్లు అధిక మోతాదులో లభిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి రోజులో ఉదయం పూట తప్పకుండా తినడం వల్ల శరీరంతో పాటు చర్మం హైడ్రేట్ గా తయారవుతుంది. దీని కారణంగా చర్మ సమస్యలు ఏవైనా ఉంటే సులభంగా తొలగిపోతాయి. అలాగే చర్మం మెరిసేలా కూడా తయారవుతుందని వారు అంటున్నారు. ఇప్పటికే చర్మంపై మచ్చలు మొటిమలు వంటి సమస్యలతో బాధపడేవారు రోజు కీరా తో తయారు చేసిన మాస్కులు కూడా వినియోగించడం వల్ల వాటి నుంచి విముక్తి పొందుతారు. అలాగే దోసకాయలో విటమిన్ కే కూడా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా ఎలాంటి కంటి సమస్యలనైనా తొలగించేందుకు కీలకపాత్ర పోషిస్తుంది.
దీంతో పాటు రోజు ఉదయం దోసకాయ తినడం వల్ల ఇందులో ఉండే పొటాషియం బ్లడ్ ప్రెషర్ ను నియంత్రించేందుకు కూడా కీలకపాత్ర పోషిస్తుంది. దీంతో పాటు తరచుగా కీళ్ళ నొప్పులతో బాధపడే వారికి కూడా ఇందులో ఉండే యాంటీ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎంతగానో సహాయపడతాయి. అలాగే శరీరంలోని యూరికి యాసిడ్ నియంత్రించేందుకు కూడా ఎంతగానో దోహదపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తరచుగా కీళ్లనొప్పులు ఇతర సమస్యలతో బాధపడేవారు తప్పకుండా దోసకాయను తినండి. ఇందులో ఉండే కొన్ని గుణాలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయి.
Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.