Curd And Lemon Benefits: పెరుగు, నిమ్మకాయ మిశ్రమం వల్ల ముఖానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..!!
Curd And Lemon Benefits: సమాజంలో మంచి గుర్తింపు పొందాలంటే మంచి ముఖం, చర్మ సౌందర్యం ఎంతో ముఖ్యం. ప్రస్తుతం మారుతున్న జీవనశైలి కారణంగా చర్మాన్ని సంరక్షించుకోవడం చాలా సవాలుగా మారింది. అటువంటి పరిస్థితిలో పెరుగును వాడి ముఖాన్ని రక్షించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.
Curd And Lemon Benefits: సమాజంలో మంచి గుర్తింపు పొందాలంటే మంచి ముఖం, చర్మ సౌందర్యం ఎంతో ముఖ్యం. ప్రస్తుతం మారుతున్న జీవనశైలి కారణంగా చర్మాన్ని సంరక్షించుకోవడం చాలా సవాలుగా మారింది. అటువంటి పరిస్థితిలో పెరుగును వాడి ముఖాన్ని రక్షించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. పెరుగు, నిమ్మకాయ వల్ల చర్మానికి సంబంధించిన అనేక రకాల సమస్యలను దూరమవుతాయని ఆయుర్వేద శాస్త్రంలో వివరించారు. పెరుగులో ఉండే గుణాలు చర్మాన్ని మెరుగుపరుస్తాయని.. మొటిమలు మొదలైన వాటిని తొలగిస్తుందని వారు పేర్కొన్నారు. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి, దాని ఇతర లక్షణాలు చర్మ సమస్యలను అధిగమించడానికి సహాయపడుతుంది. అయితే ఈ పెరుగు, నిమ్మకాయ చర్మానికి ఎలా వినియోగించాలో తెలుసుకుందాం..
పెరుగు, నిమ్మకాయ యొక్క ప్రయోజనాలు:
పెరుగు, నిమ్మకాయ పొడి చర్మానికి మేలు చేస్తుంది:
పెరుగు, నిమ్మకాయ పొడి చర్మాన్ని మెరుగుపరచడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా మొటిమల సమస్యలను దూరం చేస్తుంది. పొడి చర్మంలో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా ముఖంపై పెరుగు, నిమ్మకాయ మిశ్రమాన్ని వినియోగిస్తే పొడిబారకుండా పోతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మొటిమలు వదిలిపోతాయి:
మొటిమల నుంచి విముక్తి పొందడానికి పెరుగు, నిమ్మకాయ ఎంతగానో దోహపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మొటిమలను, మచ్చలను తొలగించడానికి ప్రయోజనకరంగా ఉంటాయి.
చర్మాన్ని తేమగా ఉంచుతుంది:
పెరుగు, నిమ్మకాయ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా వాడితే చర్మంపై తేమ నిలిచి ఉంటుంది. ఈ తేమ మన శరీరానికి మంచి సౌందర్యాన్ని ఇస్తుంది. అంతేకాకుండా చర్మాన్ని మృదువుగా, పొడి బారకుండా ఉంటుంది.
పెరుగు,నిమ్మకాయ ఫేస్ ప్యాక్:
పెరుగు, నిమ్మరసం ఫేస్ ప్యాక్ చేయడానికి.. ముందుగా 2 స్పూన్ల పెరుగుని తీసుకుని, దానికి 1 చెంచా నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి బాగా పట్టించి అరగంట తర్వాత కడిగేయాలి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Curd Benefits: పెరుగు వల్ల శరీరానికి ఎన్ని లాభాలున్నాయో..అన్ని దుష్ప్రభావాలున్నాయి..!!
Also Read: Castor Oil Benefits: ఆముదం నూనె వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయే తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook