Castor Oil Benefits: ఆముదం నూనె వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయే తెలుసా..?

Castor Oil Benefits: మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది వివిధ రకాల ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా హానికరమైన ఫుడ్‌ తీసుకోవడం వల్ల శరీరంలో వివిధ రకాల మార్పులు వస్తున్నాయి. అంతేకాకుండా పొట్ట చుట్టు కొవ్వు పెరడం  వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 7, 2022, 10:35 AM IST
  • ఆముదం నూనె వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు
  • పొట్టకు చాలా మేలు చేస్తుంది
  • పొట్ట చుట్టు కొవ్వును నియంత్రిస్తుంది
Castor Oil Benefits: ఆముదం నూనె వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయే తెలుసా..?

Castor Oil Benefits: మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది వివిధ రకాల ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా హానికరమైన ఫుడ్‌ తీసుకోవడం వల్ల శరీరంలో వివిధ రకాల మార్పులు వస్తున్నాయి. అంతేకాకుండా పొట్ట చుట్టు కొవ్వు పెరడం  వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి  ఆవ, కొబ్బరి, నువ్వుల నూనెలు వాడడం మేలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఉదర భాగంలో కొవ్వు తగ్గడానికి దాని చుట్టు ఆముదం నూనె రాసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.  నాభి చుట్టు ఈ నూనెను పూయడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం..

పొట్ట చుట్టు ఆముదం నూనె రాసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు:

పొట్టకు చాలా మేలు చేస్తుంది:

ప్రస్తుతం చాలా మంది కడుపు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. అటువంటి పరిస్థితిలో,  పొట్ట చుట్టు ఆముదం నూనె రాయడం వల్ల మలబద్ధకం, ఉబ్బరం, కడుపులో గ్యాస్, కడుపు నొప్పి వంటి కడుపు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు తెలుపుతున్నారు.  అంతేకాకుండా జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.

పీరియడ్స్ సమయంలో నొప్పిని తగ్గిస్తుంది:

పీరియడ్స్ సమయంలో మహిళలు తీవ్రమైన నొప్పి లేదా తిమ్మిర్ల సమస్యలతో బాధపడతూ ఉంటారు. అంటు వంటి సమయంలో ఆముదం నూనెను పొట్టపై పూయడం వల్ల పీరియడ్స్ సమయంలో నొప్పుల నుంచి ఉపశమనం కలిగించి, వాపును తగ్గించడానికి సహాయపడుతుంది.

చర్మానికి చాలా మేలు చేస్తుంది:

పెదవులకు ఈ ఆముదం నూనె అప్లై చేయడం వల్ల పెదవులు మెరుగుపడతాయి. అంతేకాకుండా..మొటిమలు, అలర్జీలు, మచ్చలు వంటి అనేక చర్మ సమస్యలు తొలగిపోతాయి. అంతే కాకుండా పెదవుల పగుళ్లును నియంత్రిస్తుంది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: World Food Safety Day 2022: ఇవాళ ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం.. ఎందుకు జరుపుకుంటారో తెలుసా.. ఈసారి థీమ్ ఇదే..

Also Read: World Food Safety Day 2022: ఇవాళ ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం.. ఎందుకు జరుపుకుంటారో తెలుసా.. ఈసారి థీమ్ ఇదే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News