Dark Circles Diet: కళ్ల కింద నల్లని వలయాలతో బాధపడుతున్నారా? డైట్లో వీటిని చేర్చుకోండి!
Dark Circles Diet: కళ్ల కింద నల్లని వలయాలతో బాధపడేవారు తప్పకుండా ఈ కింది సూపర్ ఫుడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చర్మ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి.
Dark Circles Diet: ప్రతి ఒక్క అమ్మాయి అందంగా కనిపించాలని కోరుకుంటారు. కానీ మారుతున్న జీవనశైలి, కాలుష్యం కారణంగా చాలా మందిలో చర్మ సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా చాలా మంది ప్రస్తుతం డార్క్ సర్కిల్స్ సమస్యలతో బాధపడుతున్నారు. వీటి నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో లభించే వివిధ రకాల సౌందర్య సాధనాలు వినియోగిస్తున్నారు. అంతేకాకుండా చాలా మంది ఖరీదైన చికిత్సలు కూడా చేయించుకుంటున్నారు. వీటిని వల్ల కొన్ని రోజుల్లో ఉపశమనం పొందినప్పటికీ భవిష్యత్‌లో తీవ్ర దుష్ప్రభావాలు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ డార్క్ సర్కిల్స్ నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి కొన్ని సూపర్ ఫుడ్స్ ప్రతి రోజు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.
ఈ సూపర్ ఫుడ్స్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది:
బాదం:
బాదంలో శరీరానికి కావాల్సిన విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని ప్రతి రోజు ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యానికి, చర్మానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చర్మానికి తేమను అందించి..పొడిబారడాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా డార్క్ సర్కిల్స్ నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది.
బ్లూ బెర్రీలు:
వీటిల్లో కూడా విటమిన్ సితో సహా యాంటీఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు వీటిని తీసుకోవడం వల్ల చర్మంలోని రక్త నాళాలను బలోపేతమవుతాయి. అంతేకాకుండా నల్లటి వలయాలను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు వృద్ధాప్య సంకేతాలు కూడా తగ్గుతాయి.
సాల్మన్ చేప:
సాల్మన్ చేపలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. అంతేకాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. దీంతో సులభంగా కళ్ల చుట్టూ వాపును తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది. ఇందులో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్‌లు కూడా అధికంగా లాభిస్తాయి. దీని కారణంగా దెబ్బతిన్నన చర్మాన్ని కూడా రిపేర్ చేస్తుంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
బచ్చలికూర:
బచ్చలికూర కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో లభించే ఐరన్ చర్మంలోని రక్త నాళాలను మెరుగుపరిచేందుకు, నల్లటి వలయాలను తగ్గించడానికి సహాయపడుతుంది.
అవకాడో:
అవకాడోలో బాడీకి కావాల్సిన కొవ్వులు, విటమిన్ ఇ పుష్కలంగా లభిస్తాయి. ఇందులో ఉండే గుణాలు చర్మాన్ని హైడ్రేట్‌గా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా చర్మం పొడిబారడాన్ని తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ కె లభిస్తుంది. కాబట్టి క్రమం తప్పకుండా ఆహారాల్లో చేర్చుకోవడం వల్ల నల్లటి వలయాలు కూడా సులభంగా తగ్గుతాయి.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..