COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Dash Diet: ఆధునిక జీవన శైలి కారణంగా చాలామందిలో గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. దీని కారణంగా మెదడు కూడా బలహీన పడుతోంది. అయితే ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణం జీవనశైలి, ఆహారపు అలవాట్లేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆధునిక జీవన శైలి కారణంగా చాలామందిలో మతిమరుపు జ్ఞాపక శక్తి తగ్గడం వంటి సమస్యలు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సమస్యలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.


NYU గ్రాస్‌మన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనంలో అనేక ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.  75 శాతం మంది మహిళలు అల్జీమర్స్ వ్యాధి బారిన పడుతున్నారని తేలింది. ముఖ్యంగా యువతలో జీవనశైలిలో భాగంగా ఆహారంలో మార్పులు చేర్పులు చేసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా చాలామందిలో అధిక రక్త పోటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులు కూడా వస్తున్నాయని అధ్యయనంలో పేర్కొన్నారు. యువత ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా జ్ఞాపక శక్తిని మెరుగుపరుచుకునేందుకు DASH డైట్ ను పాటించాల్సి ఉంటుంది.


Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  


డాష్ డైట్ అంటే ఏమిటి?
మొక్కల ఆధారిత ఆహారాలను డాష్ డైట్ అంటారు. ఈ డైట్ ను పాటించడం వల్ల శరీరానికి తగిన పరిమాణంలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం లభిస్తాయి. ఈ డైట్ ను ప్రతిరోజు పాటించడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలు, సోడియం, చక్కర పరిమాణాలు పరిమితంగా ఉంటాయి.  40-45 సంవత్సరాల వయస్సులో ఉన్నవారిలో అధిక రక్తపోటు, జ్ఞాపకశక్తి బలహీనపడటం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడే వారు కూడా ప్రతిరోజు ఈ డైటింగ్ పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారని పరిశోధనలో తెలిపారు.


DASH డైట్‌ వల్ల కలిగే ప్రయోజనాలు:
DASH డైట్‌ని మహిళలు ప్రతిరోజు పాటించడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని పరిశోధనలో తేలింది. ముఖ్యంగా వృద్ధాప్యం కారణంగా వచ్చే అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు. ప్రతిరోజు ఈ డాష్ డైట్ ను అనుసరించడం వల్ల శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ డైట్ లో ఉండే పోషకాలు ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి.


Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.