ఎడారిలో పండే అద్భుతమైన, తీయటి పండ్లు ఖర్జూరం పండ్లు. ఎడారి నేలపై పండే హై ప్రోటీన్డ్ ఫ్రూట్స్ ఇవి. ఖర్జూరంలో ఉండే పోషక పదార్ధాలు మరెందులోనూ ఉండవంటే అతిశయోక్తి లేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోషక పదార్ధాలు పుష్కలంగా ఉన్న ఖర్జూరం పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేకూరుస్తాయి. ముఖ్యంగా ఆధునిక జీవనశైలి కారణంగా సమస్యగా మారుతున్న స్థూలకాయం పరిష్కారానికి అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే బరువు తగ్గించే ప్రక్రియలో ఖర్జూరం పండ్లు భాగంగా ఉంటాయి. అయితే ఎప్పుడు తీసుకోవాలనేది తెలుసుకోవాలి.


ఖర్జూరంలో ఉండే పోషక పదార్ధాలు పలు అనారోగ్య సమస్యల్ని దూరం చేసేందుకు దోహదపడతాయి. స్థూలకాయం అంటే అధిక బరువు సమస్యతో బాధపడేవారు ఖర్జూరం ప్రతిరోజూ తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. అయితే ఓ నిర్ణీత సమయంలోనే తీసుకోవాలి. ప్రతిరోజూ ఉదయం పరగడుపున ఖర్జూరం పండ్లు తీసుకోవడం వల్ల బరువు వేగంగా తగ్గుతారు. రోజంతా సంపూర్ణ ఎనర్జీతో ఉంటారు. కేలరీలను నియంత్రించుకోవచ్చు. 


అదే ఖర్జూరం పండ్లను రాత్రి సమయంలో తీసుకుంటే జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నం కావచ్చు. ఇది హై ప్రోటీన్డ్ ఫ్రూట్ కావడంతో జీర్ణం ఆలస్యమౌతుంది. అందుకే పగలు పరగడుపునే తీసుకోవాలి. ఫలితంగా శరీరపు మెటబోలిజం మెరుగు పడుతుంది. మెటబోలిజం మెరుగుపడినప్పుడు శరీరానికి అవసరమైన ఎనర్జీ లభిస్తుంది. బరువు తగ్గించుకునేందుకు ప్రతిరోజూ పరగడుపున 3-4 ఖర్జూరం పండ్లు తినాలి. 


Also read; Tea Combinations: టీతో ఎప్పుడూ ఆ ఆరు పదార్ధాలు కలిపి తినకూడదు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook