Dead Skin Remove In 7 Days: ముఖంపై గ్లో తీసుకురావడానికి చాలా మంది మార్కెట్‌లో లభించే రసాయనాలతో కూడా ప్రోడక్ట్స్‌ వినియోగిస్తున్నారు. అయితే వీటిని వినియోగించడం చర్మానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. వాటికి బదులుగా కాఫీతో తయారు చేసిన స్క్రబ్‌ను వినియోగించాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు డెడ్ స్కిన్ సెల్స్ తొలగించి చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా  చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించడానికి సహాయపడుతుంది. కాబట్టి ఈ కాఫీ స్క్రబ్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చనిపోయిన చర్మం అంటే ఏమిటి?
చర్మంపై డెడ్ స్కిన్ సెల్స్ అంటే చర్మం పై పొరలు పేరుపోయి నిర్జీవంగా తయారు కావడం. అంతేకాకుండా కొందరి చర్మంలో కణాలు కూడా చనిపోతాయి. ఇలాంటి చర్మాన్ని డెడ్ స్కిన్ అని అంటారు. దీని కారణంగా కొందరిలో మచ్చలు, మొటిమలు పుట్టుకొస్తాయి.


చనిపోయిన చర్మ కణాలను ఎలా తొలగించాలి?
ముఖం కడుక్కుంటే డెడ్ స్కిన్ తొలగిపోదు. ఇందుకోసం ప్రత్యేక చర్మ సంరక్షణ చిట్కాలను పాటించాలి. ముఖ్యంగా ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా స్క్రబ్‌లను వినియోగించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల  సులభంగా మృతకణాలు తొలగిపోతాయి. అంతేకాకుండా చర్మం మెరుస్తూ ఉంటుంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా దీనిని వినియోగించాల్సి ఉంటుంది.


కాఫీ స్క్రబ్ ప్రయోజనాలు:
చెమట, మేకప్ మొదలైన వాటి వల్ల డెడ్ స్కిన్ కొత్త కణాలపై ప్రభావం చూపుతుంది.అయితే కాఫీతో తయారుచేసిన స్క్రబ్‌ని వినియోగించడం వల్ల ముఖంపై మచ్చల నుంచి సులభంగా ఉపశమనం కలుగుతుంది. అయితే దీనిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.


కాఫీ స్క్రబ్‌ను ఇలా తయారు చేసుకోండి:
ముందుగా 1 టీస్పూన్ కాఫీ తీసుకోవాలి.
అందులో 1 టీస్పూన్ చక్కెరను వేయాలి.
ఆ తర్వాత అందులో ఒక చెంచా తేనె కలపండి.
వీటన్నింటినీ బాగా కలపాలి.
ఇప్పుడు దీన్ని ముఖానికి పట్టించి తేలికపాటి చేతులతో మసాజ్ చేయండి.
తర్వాత 5 నిమిషాల తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని కడగాలి.
ఇలా వారానికి 3 సార్లు చేస్తే డెడ్ స్కిన్ తొలగిపోతుంది.


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read:  Rahul Sipligunj : బికినీ భామలతో రాహుల్ సిప్లిగంజ్ రొమాన్స్.. బడ్జెట్ బద్దల్ బాషింగాలైంతాందట!


Also Read: Naga Chaitanya - Samantha : నాగ చైతన్య అంటే మరీ అంత ద్వేషమా?.. అందుకే అలా చేసిందా? సమంతకు చైతూకి అదే తేడా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook