Diabetes Diet: మధుమేహం ఉన్నావారు కూడా ఈ తీపి పదార్థాలను తినొచ్చు.. ఇవి కూడా డయాబెటిస్‌కు చెక్ పెడుతాయి.
Diabetes Control In 5 Days: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మధుమేహం తీవ్ర అనారోగ్య సమస్యగా మారింది. ఈ సమస్య బారిన చిన్న వయసుల్లో ఉన్నారు వారు కూడా పడుతుండడం విశేషం. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి చాలా మార్గాలున్నాయి.
Diabetes Control In 5 Days: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మధుమేహం తీవ్ర అనారోగ్య సమస్యగా మారింది. ఈ సమస్య బారిన చిన్న వయసుల్లో ఉన్నారు వారు కూడా పడుతుండడం విశేషం. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి చాలా మార్గాలున్నాయి. ప్రొటీన్లు, పీచు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండి.. రక్తంలో చక్కెర పరిమాణం తగ్గుతుంది. కావున మధుమేహంతో బాధపడుతున్న వారు పీచు పదార్థాలు అధిక పరిమాణంలో ఉన్న ఆహారాలను తీసుకుంటే చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. అంతేకాకుండా గుండె సమస్యలు కూడా దూరమవుతాయి. అయితే దీని కోసం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
తీపి బదులుగా ఇవి తీసుకోండి:
1. ద్రాక్ష:
తీపి ద్రాక్షల్లో తిపి అధికంగా ఉంటుంది. అయినప్పటికీ మధుమేహం ఉన్నవారు వీటిని తీసుకుంటే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఆక్సీకరణ గుణాలు కలిగిన ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ అధిక పరిమాణంలో ఉంటాయి. కావున వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
2. పెరుగు:
మధుమేహం వ్యాధిగ్రస్తులకు పెరుగుతో తయారు చేసిన ఆహార పదార్థాలను అల్పాహారంగా తీసుకుంటే..రక్తంలో షుగర్ కంటెంట్ తగ్గుతుంది. ఇందులో ప్రొటీన్లు అధిక పరిమాణంలో ఉంటాయి.. కావున ఆకలిని సులువుగా నియంత్రింస్తాయి. అంతేకాకుండా శరీరంలో కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది.
3. యాపిల్:
రోజూ యాపిల్స్ తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు లభిస్తాయి. డయాబెటిక్ పేషెంట్లు కూడా వీటిని తినొచ్చని నిపుణులు తెలుపుతున్నారు. వీటిలో ఉండే గుణాలు శరీరంలో చక్కెర స్థాలను నియంత్రిస్తుంది.
4. డార్క్ చాక్లెట్:
తరచుగా అందరూ డార్క్ చాక్లెట్ తింటూ ఉంటారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు శరీరాన్ని దృఢంగా చేసేందుకు కృషి చేస్తాయి. అయితే ఇది మధుమేహం ఉన్నవారికి కూడా చాలా ప్రయోజనాలను చేకూర్చుతుందని నిపుణులు సూచిస్తారు. చాక్లెట్‌లో ఫ్లేవనాయిడ్‌లు పుష్కలంగా ఉంటాయి. కావున డయాబెటిక్ రోగులకు ఓ ప్రత్యేక ఔషధంగా పని చేస్తుంది. రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Read also: Mohan Babu: సాయిబాబా భక్తులు షిర్డీకి వెళ్లాల్సిన పని లేదు.. మోహన్ బాబు కామెంట్లపై దుమారం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook