Mohan Babu: సాయిబాబా భక్తులు షిర్డీకి వెళ్లాల్సిన పని లేదు.. మోహన్ బాబు కామెంట్లపై దుమారం

Mohan Babu Comments: తెలుగు అగ్ర హీరో మంచు మోహన్ బాబు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోంది. షిర్డీ సాయినాథునిపై మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు తాజా వివాదానికి కారణమయ్యాయి

Written by - Srisailam | Last Updated : Aug 11, 2022, 11:17 AM IST
  • మరో వివాదంలో హీరో మోహన్ బాబు
  • ఇకపై భక్తులు షిర్డీ వెళ్లాల్సిన అవసరం లేదు- మోహన్ బాబు
  • మోహన్ బాబు వ్యాఖ్యలపై సాయిబాబా భక్తుల ఆగ్రహం
Mohan Babu: సాయిబాబా భక్తులు షిర్డీకి వెళ్లాల్సిన పని లేదు.. మోహన్ బాబు కామెంట్లపై దుమారం

Mohan Babu Comments: తెలుగు అగ్ర హీరో మంచు మోహన్ బాబు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోంది. షిర్డీ సాయినాథునిపై మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు తాజా వివాదానికి కారణమయ్యాయి. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలో మోహన్ బాబు శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలు ఉన్నాయి. ఇటీవలే మోహన్ బాబు యూనివర్శిటీని కూడా ఏర్పాటు చేశారు. రంగంపేటలోనే తాజాగా మంచు ఫ్యామిలీ సాయిబాబా ఆలయం నిర్మించింది. సాయిబాబా భక్తుడైన మోహన్ బాబు.ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. రుషికేష్ నుంచి 110 ఏళ్లకు పైగా ఉన్న ఒక యోగి నుంచి చెక్కలు, అమూల్యమైన మూలికలు తీసుకొచ్చి పెట్టారు.

రంగంపేటలో నిర్మించిన సాయిబాబా ఆలయం దక్షిణాదిలోనే అతి పెద్దదని మంచు ఫ్యామిలీ చెబుతోంది. గుడికి సంబంధించిన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోహన్ బాబు.. తాను నిర్మించిన సాయిబాబా గుడి అద్భుతమన్నారు. అంతేకాదు తన దృష్టిలో ఇక తెలుగు  భక్తులు సాయిబాబా దర్శనం కోసం షిర్డీ టెంపుల్ కు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు మోహన్ బాబు. తాను ఈ గుడి కట్టాలనుకున్నప్పుడు తన కుమారుడు విష్ణు బాబు ఒక మాట అన్నారని మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు. తిరుమల శ్రీవారి సన్నిధికి వచ్చే  భక్తులంతా ఈ గుడికి రావాలని,, అలా కడితే కట్టాలని తనకు చెప్పారని తెలిపారు. విష్ణు కోరుకున్నట్లే రంగంపేటలో సాయిబాబా ఆలయాన్ని గొప్పగా నిర్మించామని మోహన్ బాబు వివరించారు.ఇదంతా తన ఒక్కడి కోసం కాదని.. దేశ ప్రజలంతా క్షేమంగా ఉండాలని దేవాలయాన్ని నిర్మించామన్నారు.

అయితే రంగంపేటలో సాయిబాబా ఆలయ నిర్మాణం అద్భుతంగా ఉన్నా.. షిర్డీ సాయినాథ్ ఆలయంపై  మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలే వివాదమవుతున్నాయి. ఇకపై సాయిబాబాను దర్శనం చేసుకోవాలంటే భక్తులు ఎవరు షిరిడి వెళ్లాల్సిన అవసరం లేదన్న మోహన్ బాబు కామెంట్లపై సాయిబాబా భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. షిర్డీపై మోహన్ బాబు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. షిర్డీకి కించపరిచేలా మోహన్ బాబు కామెంట్లు ఉన్నాయంటున్నారు నెటిజన్లు. మహారాష్ట్రలో ఉన్న షిరిడీకి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది  భక్తులు వెళ్తుంటారు. దీంతో  షిరిడి సాయినాథుడిపై మోహన్ బాబు వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మోహన్ బాబు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

Read also: Shilpa Shetty: షూటింగ్లో ప్రమాదం.. కాలు విరగ్గొట్టుకున్న శిల్పా శెట్టి!

Read also: మగువలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర! హైదరాబాద్‌లో నేటి రేట్లు ఇవే 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x