Diabetes Control Tips: షుగర్ పేషెంట్స్ బెల్లం టీ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా..!
Diabetes Control Tips: షుగర్ పేషెంట్స్ తప్పకుండా ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మంచిది. లేకపోతే తీవ్రమైన ప్రాణాతక వ్యాధులకు దారి తీసే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీరు తప్పకుండా తీపి పదార్ధాలకు దూరంగా ఉండాని నిపుణులు సూచిస్తున్నారు.
Diabetes Control Tips: షుగర్ పేషెంట్స్ తప్పకుండా ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మంచిది. లేకపోతే తీవ్రమైన ప్రాణాతక వ్యాధులకు దారి తీసే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీరు తప్పకుండా తీపి పదార్ధాలకు దూరంగా ఉండాని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ఒక వేళ చక్కెర పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలో చక్కెర పరిమణం పెరిగి గుండెపోటుకు దారి తీసే అవకాశాలున్నాయి. అయితే చాలా మంది షుగర్ వ్యాధి గ్రస్తులకు చాయ్ తాగాలనే కోరికలు కూడా ఉంటాయి. వారు తాగలేక పోతారు. పలు రకాల చిట్కాలను వినియోగించి టీని కూడా తాగొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ టీలను తాగడం వల్ల శరీరంలో చక్కెర కూడా పెరగదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
చక్కెరకు బదులుగా బెల్లం తినండి:
>>పంచదారకు బదులుగా బెల్లం టీ తాగితే.. శరీరానికి చాలా రకాల మేలు జరుగుతుందని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
>>రక్తహీనత సమస్యలతో బాధపడుతున్నవారికి కూడా బెల్లం టీ చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. జీర్ణక్రియను కూడా ఆరోగ్యంగా చేసి అలసట నుంచి దూరం చేస్తుంది.
>> చలికాలంలో కూడా షుగర్ వ్యాధి గ్రస్తుల వారికి బెల్లం టీ చాలా మేలు చేస్తుంది. అంతేకాకుండా గొంతులో పేరుకుపోయిన కఫం, నొప్పులను తగ్గిస్తుంది. దగ్గు, జలుబు సమస్యల నుంచి రక్షిస్తుంది.
>> ఈ టీలో ఉండే గుణాలు మైగ్రేన్ సమస్య నుంచి కూడా విముక్తి కలిగిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ టీని క్రమం తప్పకుండా తాగడం వల్ల ముఖంపై వచ్చే మొటిమలు దూరమవుతాయి.
>> బెల్లం టీ ఊబకాయాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Telangana Rains Live Updates: హైదరాబాద్‌లో అర్ధరాత్రి కుండపోత వాన... ఆ జిల్లాలకు ఇవాళ భారీ వర్ష సూచన
Also Read : Sravana Remedies 2022: పరమేశ్వరుడు మీ కోరికలు నెరవేర్చాలంటే... ఆగస్టు 11లోపు ఈ చిన్న పని చేస్తే చాలు!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook