Type 1 Diabetes Environmental Factors​: మధుమేహం ప్రస్తుతం అతి తొందరగా వ్యాప్తి చెందుతున్న దీర్ఘకాలిక వ్యాధుల్లో ఇది ఒకటి. ఈ వ్యాధి బారిన చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ పడుతున్నారు. చాలా మందిలో రక్తంలో చక్కెర పరిమాణాలు తీవ్రంగా పెరిగిపోవడం కారణంగా గుండెపోటు, రక్తపోటు సమస్యల బారిన కూడా పడుతున్నారు. కాబట్టి డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా ఆధునిక జీవనశైలికి దూరంగా ఉండడం చాలా వల్ల సులభంగా రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే చాలా మందిలో మధుమేహం సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు ఆహారాలే కావని, రోజు వారి అలవాట్ల కారణంగా కూడా వస్తున్నాయని వైద్యులు అంటున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మధుమేహం ఉన్నవారు గమనించాలి:
డయాబెటిస్ ఉన్నవారు శరీరపై తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి  ఉంటుంది. అంతేకాకుండా సరైన నిద్ర ఉంటేనే రక్తంలో చక్కెర పరిమాణాలు పెరగకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే గ్లూకోజ్ నియంత్రణ, ఇన్సులిన్ నిరోధకతపై ప్రభావం పడుతుంది. అంతేకాకుండా ఒత్తిడి పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. మధుమేహం ఉన్నవారు తప్పకుండా సరైన మోతాదులో నిద్రపోవాల్సి ఉంటుంది.


Also Read: Cyclone Biparjoy: దూసుకువస్తున్న బిపోర్‌ జాయ్‌ తుఫాన్.. ఎఫెక్ట్ ఎక్కడంటే..?


ఒత్తిడి స్థాయిపై ఆధారపడి ఉంటుంది:
ఒత్తిడి ఆరోగ్యానికి చాలా హానికరం. దీని కారణంగా చాలా రకాల తీవ్ర అనారోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు రావొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఒత్తిడి కారణంగా  శరీరంలో కార్టిసాల్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 


శారీరక శ్రమ తగ్గడం కారణంగా కూడా రక్తంలో  చక్కెర పరిమాణాలు పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి మధుమేహంతో బాధపడేవారు తప్పకుండా వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా యోగా చేయడం వల్ల కూడా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 


మందులు తప్పకుండా వాడాల్సి ఉంటుంది:
ప్రస్తుతం చాలా మంది వైద్యులను సంప్రదించిన తర్వాత ఔషధాలను వినియోగించడం మానుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆయుర్వేద గుణాలు కలిగిన ప్రోడక్ట్స్‌ తీసుకోవడం వల్ల కూడా సులభంగా మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చు. 


Also Read: Cyclone Biparjoy: దూసుకువస్తున్న బిపోర్‌ జాయ్‌ తుఫాన్.. ఎఫెక్ట్ ఎక్కడంటే..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి