How To Control Sugar: చలి కాలంలో మధుమేహం ఉన్నవారు తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు!
Diabetes Control Tips In Winter Season: చలి కాలంలో మధుమేహంతో బాధపడేవారు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
Diabetes Control Tips In Winter Season: మధుమేహం ఎంత ప్రమాదకరమైన వ్యాధో అందరికీ తెలిసిందే..ఆధునిక జీవనశైలి కారణంగా చిన్న, పెద్ద తేడా లేకుండా చాలా మంచి ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అంతేకాకుండా రక్తంలోని చక్కెర పరిమాణాలు ఒక్కసారిగా పెరిగిపోయి..కొంతమందిలో ప్రాంణాతకంగానూ మారుతోంది. ముఖ్యంగా శీతాకాలంలో మధుమేహంతో ఇబ్బంది పడేవారు తప్పకుండా శరీరంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరిగే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా జీవనశైలిలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా శరీరంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా డయాబెటిస్ ఉన్న వారు చలి కాలంలో తప్పకుండా ఈ చిట్కాలు పాటించాల్సి ఉంటుంది.
వ్యాయామం తప్పకుండా చేయండి:
చలి కాలంలో డయాబెటిస్ ఉన్నవారు వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా శరీర బరువును నియంత్రించుకోవాల్సి ఉంటుంది. చాలా మందిలో ఈ సమయంలో రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి వ్యాయామాలు చేసే క్రమంలో ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల జీర్ణక్రియ మెరుగుపడి రక్తంలోని చక్కెర పరిమాణాలపై ప్రభావం పడుతుంది.
ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలి:
మధుమేహం ఉన్నవారు చలి కాలంలో తప్పకుండా ఫైబర్, ప్రోటీన్స్, విటమిన్లు అధిక పరిమాణంలో లభించే ఆహారాలు తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఫైబర్, ప్రోటీన్లు ఆకలి నియంత్రించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి. కాబట్టి మధుమేహం ఉన్నవారు చలి కాలంలో ఎక్కువగా పండ్లు, పచ్చి కూరగాయలు, తృణధాన్యాలు, పెరుగు మొదలైన వాటిని తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.
ఒత్తిడిని తగ్గించుకోండి:
శీతాకాలంలో ఒత్తిడి పెరగడం కారణంగా మధుమేహం ఉన్నవారిలో కీళ్ల నొప్పులు, నడుము నొప్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో ఒత్తిడి కలిగించే విషయాలకు దూరంగా ఉండడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఒత్తిడి కారణంగా మధుమేహం ఉన్నవారిలో మానసిక సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
స్థూలకాయం ఉన్నవారు జాగ్రత్తగా ఉండండి:
ఊబకాయం ఆరోగ్యానికి చాలా హానికరం..కాబట్టి మధుమేహం ఉన్నవారు ఈ సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ సమస నుంచి ఉపశమనం పొందడానికి వ్యాయామాలతో పాటు ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి