Diet For Healthy Heart: గుండెపోటు ఉన్నవారు ఆహారంలో వీటిని ప్రతి రోజు తింటే చాలు.. జీవితంలో కూడా రాదు..
Diet For Healthy Heart: ప్రస్తుతం చాలామంది గుండెపోటు సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఆహారంలో పోషకాలు అధికంగా ఉండే ఈ క్రింద పేర్కొన్న ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ఆహారాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Diet For Healthy Heart: ప్రస్తుతం చాలామంది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. గుండెపోటు విషయానికొస్తే భారతదేశంలో దీని కేసులు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. అయితే ఈ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు మారుతున్న జీవనశైలేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేకపోతే ప్రాణాంతకంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమస్యలతో బాధపడుతున్న వారు ఆహారంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తీసుకుని ఆహారంలో పండ్లు, కూరగాయలతో చేసిన ఆహారాలను తీసుకోవడం చాలా మంచిది. అయితే ఎలాంటి ఆహారాలను తీసుకోవడం వల్ల ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
తప్పకుండా వీటిని ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది:
బ్రోకలీ:
బ్రోకలీ గుండె సమస్యలకు ప్రభావంతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే గుణాలు అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి బ్రోకలీ కీలక పాత్ర పోషిస్తుంది.
జంబోలన్:
బెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గుండె జబ్బులతో బాధపడుతున్నవారు క్రమం తప్పకుండా వీటితో తయారుచేసిన ఆహారాలను తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
గింజలు:
నట్స్‌లో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. బాదంను గుండె సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి రోజు తింటే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుంది.
టొమాటో:
టొమాటోలో పొటాషియం, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాలు పుష్కలంగా లభిస్థాయి. ఇందులో ఉండే పోషకాలు గుండెకు చాలా మేలు చేస్తాయి. కాబట్టి వీటితో తీసిన రసాన్ని ప్రతిరోజు తాగాల్సి ఉంటుంది.
చియా విత్తనాలు:
చియా విత్తనాలు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తొలగిస్తాయి. వీటిలో ఉండే పోషకాలు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతాయి. అంతేకాకుండా శరీర బరువు తగ్గించడానికి సహాయపడతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా శరీరాన్ని రక్షిస్తాయి.
Also Read: VSR vs WV Collections: ఒకే రోజు-ముప్పై కోట్ల తేడా.. 'వీర సింహా' vs వీరయ్య బాక్సాఫీస్ పోటీ చూశారా?
Also Read: Waltair Veerayya Day 8 Collections: 100 కోట్లు కొట్టేసిన చిరు.. టాలీవుడ్ లో 14వ సినిమాగా ఎంట్రీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook