Diet To Control Anemia: రక్త హీనత, రక్త పోటు సమస్యలకు కేవలం 14 రోజుల్లో ఎలా చెక్ పెట్టొచ్చో తెలుసా..?
Diet To Control Anemia: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది రక్త హీనత సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి పలు ఈ కింద పేర్కోన్న ఆహారాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Diet To Control Anemia: శరీరానికి రక్తం చాలా అవసరం.. శరీరం యాక్టివ్‌గా ఉండాలనుకుంటే తప్పకుండా బాడీలో రక్త పరిమాణాలు సక్రమంగా ఉండాలి. శరీరంలో రక్తం కోరతగా ఉంటే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. రక్తంలో ఇబ్బందులు, కోరత ఇతర సమస్యలు ఉంటే శరీరం బలహీనంగా మారి కళ్లు తిరగడం, అలసట, బలహీనత వంటి అనేక సమస్యల బారిన పడే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా శరీరంలోని రక్తాన్ని తనిఖీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఉత్పన్నమయితే దానినే రక్తహీనత అంటారు. రక్తహీనతలో, ఎర్ర రక్త కణాలు, హిమోగ్లోబిన్ స్థాయిలు కూడా సులభంగా తగ్గుతాయి. శరీరంలో ఐరన్ లోపించడం వల్ల ఈ సమస్య వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
వీటిని తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది:
దానిమ్మ:
దానిమ్మపండులో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. ఆహారంలో దానిమ్మను చేర్చినట్లయితే.. శరీరంలో హిమోగ్లోబిన్, రక్తంలోపాన్ని సులభంగా తగ్గిస్తాయి. దానిమ్మలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
బీట్‌రూట్:
బీట్‌రూట్‌లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల రక్తం వేగంగా పెరుగుతుంది. రక్తహీనత కోరత వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా బీట్‌రూట్ జ్యూస్ తయారు చేసి తాగవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. బీట్‌రూట్‌ను సలాడ్‌గా కూడా తీసుకోవచ్చు.
యాపిల్స్:
యాపిల్‌లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. కాబట్టి యాపిల్స్‌ను ప్రతి రోజూ తింటే శరీర వ్యాధుల నుంచి సంరక్షిస్తుంది. ఆరోగ్యానికి మేలు చేసే యాపిల్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
ఉసిరి:
ఉసిరిలో ఐరన్, విటమిన్ సి, క్యాల్షియం అధిక పరిమాణంలో అభిస్తాయి. కాబట్టి రక్తహీనత సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఉసిరి ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. బాడీలో రక్తం స్థాయిని కూడా సులభంగా పెంచుతుంది.
Also Read : Nandamuri Balakrishna Remuneration : బాలయ్య రెమ్యూనరేషన్ మరీ అంత తక్కువా?.. చిరంజీవిని అందుకోలేనంత దూరంలో
Also Read : Jabardasth Varsha Emmanuel : పిచ్చి ముదిరింది.. స్టేజ్ మీదే వర్ష మెడలో తాళి కట్టిన ఇమాన్యుయేల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook