Jabardasth Varsha Emmanuel : పిచ్చి ముదిరింది.. స్టేజ్ మీదే వర్ష మెడలో తాళి కట్టిన ఇమాన్యుయేల్!

Jabardasth Varsha Emmanuel Marraige జబర్దస్త్ వర్ష, ఇమాన్యుయేల్ మధ్య ఉన్న రిలేషన్ అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరూ కలిసి ఆన్ స్క్రీన్ మీద చేసే రచ్చ మామూలుగా ఉండదు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 5, 2022, 12:33 PM IST
  • జబర్దస్త్ ప్రోమో వైరల్
  • తాళి కట్టబోయిన ఇమాన్యుయేల్
  • స్టేజ్ మీద అంతా ఒక్కసారిగా షాక్
Jabardasth Varsha Emmanuel : పిచ్చి ముదిరింది.. స్టేజ్ మీదే వర్ష మెడలో తాళి కట్టిన ఇమాన్యుయేల్!

Jabardasth Varsha Emmanuel : జబర్దస్త్ వర్ష ఇమాన్యుయేల్ ట్రాక్ గురించి అందరికీ తెలిసిందే. బుల్లితెరపై ఈ జోడికి మంచి క్రేజ్ ఉంది. ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందని క్రియేట్ చేయడంలో జబర్దస్త్ టీం, మల్లెమాల టీం బాగానే సక్సెస్ అయింది. ఈఇద్దరూ కూడా స్క్రిప్ట్‌లో ఉన్నదానికంటే ఎక్కువగా నటించేస్తారు. తామేదో నిజమైన అమర ప్రేమికుల్లా నటించేస్తుంటారు. ఒక్కోసారి మాటలు కూడా హద్దులు దాటుతుంటాయి. అర్దరాత్రి చాటింగ్ చేస్తాం, ఇష్టం, ప్రాణం అంటూ ఇలా స్కిట్లో ఎక్స్ ట్రా డైలాగ్స్ కొడుతుంటారు.

పెళ్లి, నిశ్చితార్థం అంటూ అనేక ఈవెంట్లు చేశారు. జనాలను బక్రాలు చేద్దామని ప్రయత్నించారు. కానీ ఆడియెన్స్ మాత్రం వాటిని ఇట్టే పసిగట్టేస్తుంటారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో మరో స్టంట్ వేశారు. టీఆర్పీలను పెంచే స్ట్రాటజీలో భాగంగా ప్రోమోను ఇలా డిజైన్ చేసినట్టుగా కనిపిస్తోంది. వర్ష, ఇమాన్యుయేల్ వేసిన స్కిట్, అనంతరం పోసాని వచ్చి పొగిడేయడం, ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ గురించి అడగడం కనిపిస్తోంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News