Digestion Damage Habits: ఈ అలవాట్లే మన జీర్ణ క్రియను దెబ్బతీస్తున్నాయి!
Digestion Damage Habits: ప్రస్తుతం చాలామందిలో జీర్ణక్రియ సమస్యలు వస్తున్నాయి. నిజానికి ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణాలేంటి.. జీనక్రియ సమస్యల కారణంగా వచ్చే ఇతర సమస్యలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Digestion Damage Habits: మనుషుల శరీరం ఆరోగ్యంగా పనిచేయడానికి అన్ని రకాల అవయవాలు ఎంతగానో సహాయపడతాయి. అందులో ముఖ్యంగా జీర్ణక్రియ కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఇది మనం తీసుకునే ఆహారాన్ని అరిగించి అందులో నుంచి పోషకాలను వివిధ రకాల అవయవాలకు శరీరానికి అందిస్తుంది. అలాగే వ్యర్థ పదార్థాలను బయటికి ఎలా చేస్తుంది. అందుకే అన్ని అవయవాల కంటే జీర్ణ క్రియకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందని వైద్యశాస్త్రంలో పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం చాలామందిలో జీర్ణక్రియ సమస్యలు వస్తున్నాయి. నిజానికి జీర్ణక్రియ సమస్యల కారణంగానే కొంతమందిలో ఇతర దీర్ఘకాలిక వ్యాధులు కూడా వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వయస్సు మళ్ళిన వారిలో ఎక్కువగా ఈ సమస్యలు వస్తున్నాయని తెలుస్తోంది. అయితే కొన్ని రకాల అలవాట్ల కారణంగానే జీర్ణ క్రియ దెబ్బ తింటుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి జీర్ణక్రియ దెబ్బతినడానికి ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
జీర్ణ క్రియను పాడు చేసే అలవాట్లు..
అల్పాహారం తీసుకోకపోవడం:
జీర్ణ క్రియ ఆరోగ్యంగా ఉండడానికి తప్పకుండా పోషకాలు తగిన మోతాదులో కలిగిన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం చాలామంది ఎక్కువగా అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యల బారిన పడుతున్నారు. అంతేకాకుండా చాలామంది ఉదయం పూట అల్పాహారాలు కూడా తీసుకోవడం లేదు. అయితే వైద్యుల అభిప్రాయం ప్రకారం ఉదయం పూట అల్పాహారాలు తీసుకోకపోయినా జీర్ణ క్రియ మందగించే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఎక్కువ జంక్ ఫుడ్ తినడం:
చాలామంది ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తింటూ ఉంటారు. నిజానికి ఇలా తినడం మంచిదేనా? అయితే అతిగా జంక్ ఫుడ్ తినడం వల్ల కూడా అనేక రకాల సమస్యలకు దారి తీయవచ్చని, అందులో ముఖ్యంగా జీర్ణక్రియ మందగించే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే జంక్ ఫుడ్ తింటున్న వారు తప్పకుండా మానుకుంటే మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.
నీటిని తాగకపోవడం:
కొంతమంది ఆహారాలు తీసుకున్నప్పటికీ నీటిని అసలు తాగకుండా ఉంటారు. ఇలా చేయడం ఎంతవరకు మంచిదో తెలుసా? నిజానికి ఆహారాలు తీసుకున్న తర్వాత తప్పకుండా నీటిని తాగాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతిరోజు ఏం లేకున్నా రెండు నుంచి మూడు లీటర్ల పాటు నీటిని తప్పకుండా తాగాల్సి ఉంటుంది. లేకపోతే అనేక రకాల జీర్ణక్రియ సమస్యలకు దారి తీసే ఛాన్స్ కూడా ఉంది.
ఎక్కువ ఆహారాలు తినడం:
చాలామంది దొరికిందే సందని ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు అతిగా ఆహారాలు తీసుకుంటూ ఉంటారు. మరికొందరైతే రాత్రి పడుకునే ముందు ఎక్కువగా తిని పడుకుంటూ ఉంటారు. నిజానికి ఇలా చేయడం వల్ల అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులతో పాటు జీర్ణక్రియ మందగించే అవకాశాలున్నాయి అలాగే దీనికి కారణంగా మలబద్దకం కూడా రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Lungs Damage: ఈ అలవాట్లే ఊపిరితిత్తులను నాశనం చేస్తున్నాయి!
చెక్కర అధికంగా ఉన్న ఆహారాలు:
చెక్కర అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. అదే విధంగా కొంతమందిలో వీటిని తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ కూడా మందగించే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ముఖ్యంగా జీర్ణ క్రియ సమస్యలతో బాధపడుతున్న వారు ఎలాంటి పరిస్థితుల్లోనూ చక్కెర ఉన్న ఆహారాలను తినకూడదు.
ఇది కూడా చదవండి: Lungs Damage: ఈ అలవాట్లే ఊపిరితిత్తులను నాశనం చేస్తున్నాయి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.