Foods To Avoid In Summer: వేసవికాలంలో ఎండలు దంచికొడుతాయి. ఈ సమయంలో మీరు ఆరోగ్యం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.  ముఖ్యంగా ఆహారం విషయంలో పలు జాగ్రత్తులు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే సమ్మర్‌లో కొన్ని ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల శరీరానికి నష్టం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల మనం అనారోగ్య సమస్యల బారిన పడుతాము అనేది తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వేసవిలో అసలు తీసుకోకుండా ఉండాల్సి పదార్థాలు: 


సమ్మర్‌లో చాలా మంది వేడి వస్తువులను, స్పైసీ పదార్థాలను తీసుకుంటారు. దీని వల్ల శరీరంలో వేడి క్రమక్రమంగా పెరుగుతుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు.   అలాగే బయట తయారు చేసే ఆహారపదార్థాలలో మసాలాలు అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యస్థ దెబ్బతింటుంది. ప్రస్తుతకాలంలో చాలా మంది ప్రాసెస్‌ చేసి ఆహారపదార్థాలను తీసుకోవాడిని ఇష్టపడుతున్నారు. ఈ ఆహారపదార్ధాలకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఈ పదార్థాలలో సోడియం అధికంగా ఉంటుంది. దీని వల్ల డీహైడ్రేషన్‌ సమస్య కలుగుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్‌, జీర్ణసమస్యలు కలుగుతాయి. 


అతిగా వేయించిన ఆహారాలు కూడా వేసవికాలంలో తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు కలుగుతాయి. దీనిని తీసుకోవడం వల్ల కడుపు లైనింగ్‌ను దెబ్బ తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా మొటిమలు, మచ్చలు చర్మం పై కలిగే అవకాశం ఉంది.  


ఉదయం పూట కాఫీ, టీ వంటి పానీయాలు తీసుకుంటారు. దీనిలో ఉండే కెఫెన్‌ కంటెంట్‌ శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. అలాగే వాటర్‌ లెవల్స్‌ను తగ్గిస్తుంది. దీని వల్ల డీహైడ్రేషన్‌ సమస్యలు కలుగుతాయి. అధిక షుగర్‌ కలిగిన పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా మీరు వేసవిలో అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుంది. ఇవి జీర్ణక్రియను ఇబ్బంది కలిగేలా చేస్తాయి. శరీరంలో కొవ్వు కూడా పెరుకొనే అవకాశం ఉంటుంది. వీటికి బదులుగా మీరు పుచ్చకాయలు, ఆరెంజ్‌, నిమ్మకాయలతో తయారు చేసే జ్యూస్‌లను తీసుకోవడం చాలా మంచిది.  


వేసవిలో మీరు నూనె, షుగర్‌, పిండి పదార్థాలు కాకుండా ఏదైన సునీతమైన ఆహారపదార్థాలు తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎండాకాలంలో కొబ్బరినీళ్ళు, పండ్లు రసాలు, మజ్జిగ, తేలికమైన ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.  మీరు వేసవిలో అధిక జంక్‌ ఫూడ్‌, నూనె కలిగన ఆహారపదార్థాలు,  అతిగా వేయించిన పదార్థాలు తీసుకుంటున్నారా. అయితే ఇకపైన వీటికి దూరంగా ఉండండి. దీని వల్ల మీరు అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుంది. 


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి