Skipping Meals: మధ్యాహ్నం భోజనం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
Effects Of Skipping Meals: ప్రస్తుతం అధిక బరువు సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. ఈ సమస్య కారణంగా అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే కొంతమంది మధ్యాహ్నం భోజనం తినడకుండా ఉంటారు. ఇలా చేయడం వల్ల బరువు తగ్గుతారని భావిస్తారు. అయితే ఇలా మధ్యాహ్నం భోజనం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
Effects Of Skipping Meals: అధిక బరువు ఉడటం వల్ల చాలామంది డైట్ కొంట్రోల్ చేస్తూ ఉంటారు. దీని కోసం డైట్ ప్లాన్ కూడా పాటిస్తుంటారు. అయితే కొంతమంది అన్ని ఆహార అలవాట్లలో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. అందులో మధ్యాహ్నం భోజనం చేయకుండా ఉంటారు. ఇలా మధ్యాహ్నం భోజనం మానేయడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
⥱ మధ్యాహ్నం భోజనం మానేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
⥱ భోజనం మానేయడం వల్ల తీవ్రమైన తలనొప్పి, కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.
⥱ మధ్యాహ్న భోజనం మానేయడం వల్ల బరువు పెరుగుతారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
⥱ మధ్యాహ్న భోజనం చేయకుండా ఉండటం వల్ల జీవక్రియ దెబ్బతింటుంది.
⥱ మధ్యాహ్న భోజనం తినకుండా ఉండటం వల్ల అలసట, శరీరానికి అవసరమైన పోషకాలు అందకుండా ఉంటాయి.
⥱ మధ్యాహ్న భోజనం మానేయడం వల్ల గుండెల్లో మంట, అసిడిటీ సమస్యలు కొనితెచ్చుకున్నట్లవుతుందని నిపుణులు అంటున్నారు.
అయితే ఆరోగ్య నిపుణుల ప్రకారం మధ్యాహ్నం 12 - 1 గంటల మధ్య భోజనం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారని చెబుతున్నారు. మీరు కూడా మధ్యాహ్న భోజనం మానేస్తున్నారా.. అయితే ఇలా చేయడం మానుకోండి లేదంటే తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter