Dark Neck Remedies: మెడ చుట్టూ నల్లగా అందవికారంగా ఉందా.. ఒక్కసారి ఇది ట్రై చేయండి..!
Dark Neck Remedies: మెడ చుట్టూ ఉండే నలుపుదనం పోవాలి అంటే.. వంటింట్లో దొరికే కొన్ని రకాల పదార్థాలతో నలుపును తగ్గించవచ్చు. దీనికోసం పార్లర్ చుట్టూ తిరిగే అవసరం లేదు. ముఖ్యంగా పిల్లల్ని కన్న తర్వాత.. కొంతమందిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. మరి అలాంటి వాళ్ళు దీని నుంచి ఎలా తప్పించుకోవాలో చూద్దాం..
Dark Neck Packs: సాధారణంగా చాలామంది ముఖం మీద ఫోకస్ చేస్తారు... కానీ మెడను అస్సలు పట్టించుకోరు.. ఫలితంగా ముఖం తెల్లగా ఉంటుంది. మెడ మాత్రం నల్లగా ఉంటుంది. అయితే మెడ ఇలా నల్లగా ఉండడానికి చాలా కారణాలు కూడా ఉంటాయి.. అయితే ఈ సమస్యను తగ్గించుకోవడానికి చాలా మంది వందలకు వందలు ఖర్చు చేస్తూ ఆన్లైన్లో దొరికే ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ వాటిని ఉపయోగిస్తూ ఉంటారు.. అయితే అన్ని ప్రోడక్ట్లు అన్ని రకాల చర్మాలకు సరిపోతాయని చెప్పలేం. ఒక్కొక్కసారి వీటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కలిగే ప్రమాదాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎటువంటి డబ్బు ఖర్చు లేకుండా కేవలం ఇంట్లో.. దొరికే వస్తువులతోనే మెడ మీద ఉండే నలుపును తగ్గించుకోవడం ఎలాగో.. ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా చదివి తెలుసుకుందాం.
శనగపిండి :
శనగపిండి మంచి స్క్రబ్బర్ లా పని చేస్తుంది. శనగపిండి చర్మాన్ని కాంతివంతం చేయడానికి కూడా సహాయపడుతుంది. ఇది చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించి చర్మాన్ని కూడా శుభ్రపరుస్తుంది. దీనికోసం మీరు ముందుగా.. ఒక బౌల్ తీసుకొని.. అందులో రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి, కొద్దిగా పసుపు, కొద్దిగా పెరుగు వేసి మిశ్రమంలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టి.. ఆ తర్వాత మెడకు అప్లై చేయాలి. ఆ తర్వాత ఒక 20 నిమిషాల పాటు ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసి.. శుభ్రంగా ఉండే కాటన్ టవల్ సహాయంతో తడిని మొత్తం తుడిచేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం లభిస్తుంది.
పాలతో మసాజ్:
పాలు మంచి మాయిశ్చరైసర్ మాత్రమే కాదు క్లెన్సర్.. టోనర్ కూడా .. పచ్చిపాలను దూది సహాయంతో మెడ చుట్టూ అప్లై చేసి స్మూత్ గా మర్దనా చేయాలి. 20 నిమిషాల తర్వాత మెత్తని గుడ్డతో శుభ్రం చేయాలి.. ఇలా తరచూ చేస్తున్నట్లయితే మెడ చుట్టూ ఉండే నలుపు రంగు పోయి సహజ రంగు రావడం గమనించవచ్చు.
ఆలివ్ ఆయిల్:
ఆలివ్ ఆయిల్ లో కొంచెం పంచదార కలిపి మెడ చుట్టూ మసాజ్ చేయాలి.. ఇలా క్రమం తప్పకుండా చేస్తే నల్లటి మచ్చలు తొలగిపోతాయి.. ఇక ఆలివ్ ఆయిల్లో ఉండే విటమిన్ ఈ, విటమిన్ కె చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి. ఇక ఇవన్నీ కూడా మెడను శుభ్రంగా సహజ రంగును కోల్పోకుండా కాపాడతాయి.
Read more: DSC Aspirants Protest: ఓయూలో హైటెన్షన్.. ఆందోళనకారుల వెంట పడి మరీ అరెస్టులు.. వీడియో వైరల్..
Read more: Rat in Chutney: చట్నీలో చిట్టెలుక ఎంత బాగా ఈత కొడుతుందో చూశారా..?.. వీడియో ఇదిగో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి