Smartphone Users: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మనందరి జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. స్మార్ట్‌ఫోన్ లేనిదే జీవితమే లేదనే స్థాయిలో ఫోన్ అందరినీ కవర్ చేసింది. కానీ, మనం రోజూ స్మార్ట్‌ఫోన్‌లను ఎంత వాడతామో తెలుసా?  ఒక నివేదిక ప్రకారం భారతీయ వినియోగదారు తమ స్మార్ట్‌ఫోన్‌ను రోజుకు 70-80 సార్లు టచ్ చేస్తారు. వీరిలో దాదాపు సగం మందికి ప్రత్యేక కారణం లేకుండా ఫోన్లను తరచుగా ఓపెన్ చేసే అలవాటు ఉన్న సంగతి తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్మార్ట్‌ఫోన్ వినియోగంపై ప్రజల అభిప్రాయం: 
ఇటీవలి కాలంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం బాగా పెరగడంతో స్మార్ట్‌ఫోన్ అనుభవాన్ని మార్చడం ,స్మార్ట్‌ఫోన్‌లు ముఖ్యమైన పాత్రను ఎలా పోషిస్తాయి అనే పేరుతో వెయ్యి మందికి పైగా అభిప్రాయాన్ని సేకరించారు. ఈ రోజు స్మార్ట్‌ఫోన్‌లను ప్రజలు ఎలా ఉపయోగిస్తున్నారనే దానిపై ఈ నివేదిక వెలుగుచూసింది. భారతదేశం అంతటా ప్రజలు ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఎలా ఉపయోగిస్తున్నారు. వాస్తవ డేటా ఆధారంగా ఈ నివేదిక రూపొందించబడింది.


ఇదీ చదవండి: తక్కువ బడ్జెట్‌లో రాయల్ వెడ్డింగ్ చేసుకోవాలనుకుంటున్నారా? ఈ ఐడియాస్ మీకోసం..


50% మంది వ్యక్తులు తమ ఫోన్‌ను ఎందుకు తెరుస్తారో తెలియదు: 
బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG) నివేదిక ప్రకారం చాలా మంది వ్యక్తులు తమ ఫోన్‌లను తరచుగా తాకడం అలవాటు చేసుకున్నప్పటికీ వారిలో 50% మందికి వారు తమ స్మార్ట్‌ఫోన్‌లను ఎందుకు తెరుస్తారో తెలియదు. కానీ 45-50% మంది కొన్ని పనుల కోసమే తమ ఫోన్లను ఓపెన్ చేస్తారని చెబుతున్నారు. 


మా పరిశోధనలో కేవలం ఫోన్‌ని చూసే అలవాటు వల్ల తమ ఫోన్‌లను ఎందుకు ఎత్తుతున్నారో తెలియని సగం మంది వ్యక్తులు తరచుగా అలా చేస్తున్నారట.  స్మార్ ఫోన్ ఉపయోగించడం వల్ల ప్రజలకు వారి అభిరుచులకు అనుగుణంగా వారికి సంబంధించిన విషయాలను తెలియజేయవచ్చని సెంటర్ ఫర్ కస్టమర్ ఇన్‌సైట్స్ ఇండియా హెడ్ కనికా సంఘీ తెలిపారు. 


ఇదీ చదవండి: ఈ పొలిటికల్ లీడర్స్ లవ్ స్టోరీ తెలిస్తే వావ్ అంటారు..


వాస్తవానికి మనందరికీ తెలిసినట్లుగా ఇటీవలి దశాబ్దాలలో స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించే మార్గాలు చాలా పెరిగాయి. ఇంతకు ముందు స్నేహితులు, బంధువులతో కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించిన స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పుడు వేర్వేరు ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతున్నాయి. ఉదాహరణకు: వినోదం, ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయడానికి, సమాచార శోధన, ఆటలు, డిజిటల్ చెల్లింపు, వార్తలు, 
చదువుతోపాటు అనేక ఇతర పనులకు స్మార్ట్‌ఫోన్లను ఉపయోగిస్తున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter