Girls Google Searching: 17 శాతం మంది అమ్మాయిలు ఇంటర్నెట్ లో సెక్స్ గురించి సెర్చ్ చేస్తున్నారట!
Girls Google Searching: మనకు తెలియని విషయాలను పరిశోధించేందుకు ఇంటర్నెట్ ను ఉపయోగిస్తున్నారు. అయితే ఇంటర్నెట్ లో గూగుల్ సెర్చ్ ఇంజిన్ ద్వారా అనేక రకాల విశేషాల గురించి రోజుకు కొన్ని కోట్లకుపైగా విశ్లేషణలు జరుగుతాయి. కానీ, అలాంటి గూగుల్ ద్వారా అమ్మాయిలు ఎక్కువగా ఏఏ విషయాల గురించి సెర్చ్ చేస్తున్నారో ఇటీవలే ఓ సర్వే పేర్కొంది. దాదాపుగా 17 శాతం మంది టీనేజర్లు సెక్స్ గురించి సెర్చ్ చేశారట. ఇంతకీ ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.
Girls Google Searching: ఆధునిక కాలంలో సాంకేతికత చాలా వేగంగా పెరిగిపోతుంది. ప్రస్తుతం మొబైల్ లేని ఇల్లు లేదు అని చెప్పడంలోనూ అతిశయోక్తి లేదు. రోజువారీ వ్యవహరాలు, కార్యకలాపాల కోసం మొబైల్ ఫోన్ ను కచ్చితంగా వాడాల్సి వస్తున్న ఈ రోజుల్లో.. సాంకేతికతతో ఏ విషయాన్నైనా ఇంటర్నెట్ ద్వారా ఇట్టే తెలుసుకోవచ్చు. కానీ, అలాంటి అసాధారణమైన సెర్చ్ ఇంజిన్ గూగుల్ లో రాత్రుళ్లు అనేక విషయాల గురించి సెర్చింగ్ జరుగుతుందని ఇటీవలే కొన్ని అధ్యయనాలు పేర్కొన్నాయి.
మరి ముఖ్యంగా పురుషులతో పోలిస్తే మహిళలు రాత్రుళ్లు ఎక్కువగా ఇంటర్నెట్ వినియోగిస్తున్నారని ఆ అధ్యయనాలు తేల్చి చెప్పాయి. అయితే ఆ అధ్యయనాల ద్వారా అమ్మాయిలు అనేక విషయాల గురించి సెర్చ్ చేస్తున్నారని తెలిసింది. అందుకు మెజారిటీ సెర్చింగ్ విశేషాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
2 కోట్ల మంది మహిళలు యాక్టివ్ గా..
జాతీయ మీడియా నివేదికల ప్రకారం.. దేశంలో మొత్తం 150 మిలియన్ల (150 కోట్ల ఇంటర్నెట్ కలెక్షన్లు) ఇంటర్నెట్ వినియోగదారుల ఉన్నారు. అందులో 20 మిలియన్ల (2 కోట్లు) మంది మహిళలు ఆన్ లైన్ లో ఎక్కువగా గడుపుతున్నారు. అందులో 75 శాతం మంది మహిళలు 15-34 ఏళ్ల మధ్య వయసు వారే కావడం గమనార్హం.
ఆ నివేదికల ప్రకారం.. వారిలో 31 శాతం మంది టీనేజ్ అమ్మాయిలు, ఫిట్ గా ఉండేందుకు కావాల్సిన సమాచారం కోసం గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. మరో 17 శాతం మంది సెక్స్, డిప్రెషన్స డ్రగ్స్ మొదలైన వాటి గురించి వెతుకున్నారు. కాబట్టి.. ఇలాంటి పరిస్థితుల్లో అమ్మాయిలు ఇంటర్నెట్ లో వేటి కోసం వెతుకుతున్నారో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.
అమ్మాయిలు రాత్రుళ్లు గూగుల్ లో సెర్చ్ చేసే విషయాలు..
1) కెరీర్ నిర్మాణం కోసం కావాల్సిన టిప్స్ గురించి గూగుల్ లో ప్రధానంగా శోధన జరుగుతుంది. ఏ కెరీర్ ఎంచుకోవడం వల్ల జీవితంలో వృద్ధి సాధిస్తామనే సమాచారాన్ని అమ్మయిలు సెర్చ్ చేసినట్లు తెలుస్తోంది.
2) అంతే కాకుండా ఆరోగ్య సూత్రాలు, కొత్త కొత్త చిట్కాల గురించి సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. తమను తాము అందంగా ఉంచుకునేందుకు ఈ శోధనలు జరుగుతున్నాయి.
3) ప్రస్తుత కాలంలో చాలా మంది అమ్మాయిలు ఉబకాయం సమస్యతో బాధపడుతున్నారు. ఆ ఉబకాయాన్ని తగ్గించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
4) అమ్మాయిలు తమ జుట్టు లేదా జడ విషయంలో చాలా సున్నితంగా ఆలోచిస్తుంటారు. తమ జట్టును ఏ విధంగా కత్తిరించుకుంటే అందంగా ఉంటారో అనే విశేషాలను తెలుసుకుంటున్నారు.
(నోట్: పైన పేర్కొన్న సమచారమంతా కొన్ని నివేదికలను అనుసరించి రాసినది. ఈ సర్వేను ZEE తెలుగు News ధ్రువీకరించడం లేదు.)
Also Read: Viral Video: ఉన్నట్టుండి కుప్పకూలిన శునకం.. నోట్లో నోరు పెట్టి ఊది బతికించాడు
Also Read: Telangana Viral Video: మరో ప్రాణాన్ని కాపాండేందుకు.. ప్రాణాలకు తెగించిన తెలంగాణ హోంగార్డు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook